విజయవాడ

పెనం మీద నుంచి పొయ్యిలోపడ్డ రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 22: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 50రోజుల పాలనలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, గత ప్రభుత్వ పాలనలో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. సోమవారం నగరంలోని పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 39మంది చనిపోగా, అనధికారికంగా ఈ సంఖ్య 10రెట్లు పెరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో బ్యాంకు అప్పు నోటీసు ఇచ్చారనే అవమాన భారంతో హనుమంతరావు అనే రైతు తన పొలంలోనే ఆత్మహత్య చేసుకోగా, కృష్ణా జిల్లా మొవ్వలో కౌలురైతు జయకుమార్ పురుగుల మందుతాగి చనిపోయిన ఉదంతాలు కొన్ని మాత్రమేనన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలను సీఎం జగన్ కానీ, మంత్రులు కానీ పరామర్శించిన దాఖలాలు లేకపోవడం శోచనీయమన్నారు. రైతు పెట్టుబడి కింద 12,500 ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన్న జగన్ కేంద్రం పీఎం కిసాన్ యోజన కింద 6వేలతో కలిపి 12,500 ఇస్తాననడం మాట తప్పడమే అవుతుందన్నారు. వర్షాభావం, కరవు, ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న విషయాన్ని గుర్తించి తక్షణం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు తులసిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు జెట్టి గుర్నాథరావు మాట్లాడుతూ రైతుల దుర్భర పరిస్థితులు, వారిని ఆదుకోవాలంటే తక్షణం ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాల అమలుపై ఈ నెల 26న నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో అన్ని పార్టీల నేతలు, రైతుసంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.