విజయవాడ

లోకేష్‌పై వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 22: టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్‌పై తాను ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో ఉన్నత విద్యా మండలిలో అవకతవకలపై, పంచాయతీరాజ్ శాఖ నిధులను పసుపుకుంకుమకు మళ్లించడంపై ఇద్దరు మాజీ మంత్రుల పేర్లను మంత్రి సురేష్ ప్రస్తావించడం తెలిసిందే. ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని, లేదా క్షమాపణ చెప్పాలని లోకేష్, టీడీపీ సభ్యులు పట్టుబట్టడం తెలిసిందే. దీనిపై రికార్డులు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. దీనిపై సోమవారం టీ విరామం అనంతరం సభ సమావేశమయ్యాక, ఈ విషయమై చైర్మన్‌ను ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రస్తావించారు. ఈ నెల 18న మాజీ మంత్రి లోకేష్‌పై మంత్రి నిరాధారమైన ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. దీనికి తగిన సాక్ష్యాధారాలు చూపించాలని, లేకుంటే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, గత గురువారం ఉన్నత విద్యామండలిపై సభ్యులు చాలా ప్రశ్నలు అడిగారని గుర్తు చేశారు. మండలి నిధులను పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని వివరించే ప్రయత్నం చేశానని తెలిపారు. పంచాయతీరాజ్ నిధులను మళ్లించడంపై మరో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేసిన సమయంలో టీడీపీ సభ్యులు మూకుమ్మడిగా తనపై విమర్శలు చేశారన్నారు. నిధుల కొరత ఉన్నప్పుడు చెల్లెమ్మల కోసం నిధుల మళ్లింపు ఎంతవరకూ సబబు అని ప్రశ్నించానన్నారు. అది సాధారణ విషయంగా లోకేష్ చెబుతున్నారన్నారు. నిధుల మళ్లింపు ఎలా జరిగిందన్న విషయం వివరించే ప్రయత్నం చేశానని, లోకేష్‌పై చేసిన వ్యాఖ్యలు ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి కావన్నారు. ఈ దశలో సీఎంపై కూడా విమర్శలు చేశారని గుర్తు చేశారు. మంత్రి సమాధానంపై సంతృప్తి చెందిన చైర్మన్ షరీఫ్, లోకేష్‌పై మంత్రి చేసిన వ్యాఖ్యలను, సీఎంపై టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వివాదం ఇంతటితో ముగిసినట్లుగా ప్రకటించారు.

సెల్‌ఫోన్.. ఐటీ వేరువేరు
*ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌కు మంత్రి బుగ్గన చురక

విజయవాడ, జూలై 22 ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చురకలు వేశారు. రాష్ట్ర శాసన మండలిలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు సోమవారం మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దేశంలో 10 సెల్‌ఫోన్‌లు తయారవుతుంటే, వాటిలో ఏపీలో రెండు ఏపీలో తయారవుతున్నాయని, ఇది తమ ప్రభుత్వం ఐటి అభివృద్ధికి తీసుకున్న చర్యలే కారణమన్నారు. వాటాల కోసం, కమీషన్ల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టవద్దన్నారు. మంత్రి బుగ్గన కూడా సర్పంచ్‌గా పని చేశారని, తాను అప్పుడు సంఘం నేతగా ఉన్నానని తెలిపారు. దీనిపై మంత్రి బుగ్గన స్పందిస్తూ, ఒక కథ చెప్పారు. తాను పాఠశాల చదువుతున్న రోజుల్లో పెంపుడు జంతువుపై ఒక వ్యాసం రాయమని ఉపాధ్యాయురాలు చెప్పారన్నారు. ఒక విద్యార్థి రెండు పేజీలపై ఆవు గురించి రాశాడన్నారు. దీనిని చూసిన ఆ టీచరు రెండు వైపులా కొట్టేసి, రెండు మార్కులు వేసిందన్నారు. ఈ రెండు మార్కులు కూడా కష్టపడి రాసినందుకు వేశానంటూ, ఎందుకు మార్కులు వేయలేదో అని చెబుతూ ఆవు పెంపుడు జంతువు కాదని చెప్పినట్లు వివరించి... సెల్‌ఫోన్ అంటే ఐటి కాదని గుర్తు చేయడంతో సభలో నవ్వులు విరిసాయి. గత ప్రభుత్వాన్ని ప్రజలు తప్ప అందరూ మెచ్చుకున్నారని చురక వేశారు.