విజయవాడ

బిరబిరా కృష్ణమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఆగస్టు 15: ప్రకాశం బ్యారేజీ వద్ద రానురాను నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చుతోంది. కలెక్టర్ ఇంతియాజ్ ఎన్‌డీఆర్‌ఎఫ్ సి బ్బంది, ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గురువారం ఉదయం 4.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా రానురాను వరదనీటి ఉద్ధృతి పెరిగిం ది. గురువారం రాత్రికి 6.10 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. వ చ్చిన నీరు వచ్చినట్లుగా బ్యారేజీ దిగువకి విడుదల చేస్తున్నారు. దాంతో దిగు వ ప్రాంత లోతట్టు ప్రాంతాలు జలమయమై వందలాది కుటుంబాలు కట్టుబట్టలతో రక్షిత శిబిరాలకు పరుగులు తీస్తున్నారు. గురువారం రాత్రికి వరద ఇంకా పెరుగుతుందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇం కా పెరుగుతూ ఉంటే బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఎగురవేయనున్నారు. బరంపార్కులోని పర్యాటక శాఖ నిర్వహణలో ఉన్న పున్నమి కాటేజీలు, పున్నమి ఫంక్షన్ హాల్, పున్నమి హోటల్‌కి వరద తాకిడి ఎక్కువ కా నుంది. శుక్రవారం ఉదయానికి మరో రెండు లక్షల క్యూసెక్కుల నీరు పెరిగే అవకాశం ఉందని అంచనా. శ్రీశైలం జలాశయం, నాగార్జున సాగర్ నుండి 7.40 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశముంది. అదే జరిగితే బరంపార్కు ఆరు అడుగుల మేర మునిగిపోతుంది. భవానీపురం కరకట్ట ప్రాంతంలో కుమ్మరిపాలెం సెంటర్, హరిజనవాడ ప్రాంతాలు నీట మునుగుతాయి. వెస్ట్‌జోన్ ఏసీపీ కే సుధాకర్ ఆధ్వర్యంలో వన్‌టౌన్, టుటౌన్, భవానీపురం పోలీసులను అప్రమత్తం చేశారు. అలాగే ట్రాఫిక్‌కి అంతరాయం కల్గుకుండా వెస్ట్ ట్రాఫిక్ ఏసీపీ ఎం సూర్యనారాయణ రెడ్డి కూడా వన్ ట్రాఫిక్ సెక్టార్ పోలీసులను, భవానీపురం సెక్టార్ ట్రాఫిక్ పోలీసులను వరద బాధితుల సహాయక చర్యలకు సంసిద్ధంగా ఉన్నారు. బరంపార్కులోని పున్నమి హోటల్‌లో గురువారం రాత్రి ట్రైబల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం, విందు జరుగుతుంది. ఆ కార్యక్రమం అనంతరం తాము కూడా విలువైన సామగ్రిని రక్షిత ప్రాంతాలకు తరలించనున్నామని మేనేజర్ కే శ్రీనివాసరావు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.