విజయవాడ

వరదపై అంచనాల్లో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 18: కృష్ణానది వరదపై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయలేకపోవడంతో బాధితులు అష్టకష్టాలు పడాల్సి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆదివారం కృష్ణలంకలోని రణదివే నగర్, కరకట్ట నెహ్రూనగర్, తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలపై అంచనా ఉంటే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేవారని, అర్ధరాత్రి వరద వస్తే కట్టుబట్టలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన వైనం గమనార్హమన్నారు.ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందలకు గురిచేస్తున్నారని ఆరోపించిన ఆయన జగన్ విదేశాలకు వెళ్లి ప్రజలను, వరద బాధితులను గాలికొదిలేశారని, వరదల అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని టీడీపీ, వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఇల్లు కన్నా ప్రజల కష్టాలపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. వరదలపై ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయలేదంటే వరదపై ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఉన్న అంచనా ఏపాటిదో తెలుస్తోందన్నారు. కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. రాజధాని నగరమంటున్న విజయవాడకు వరద నుంచి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ప్రధాని ఆవాస యోజన కింద ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కేటాయించాలని, ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి అడపా శివనాగేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

సత్వరం రిటైనింగ్ వాల్ నిర్మించాలి
* సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్
విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 18: కృష్ణానది వరదల నుంచి విజయవాడ నగరానికి శాశ్వత పరిష్కారంగా సత్వరమే రిటైనింగ్ వాల్ నిర్మించాలని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలో వరద ముంపునకు గురైన కష్ణలంక గీతానగర్, డొంకరోడ్డు, భూపేష్‌గుప్తానగర్, పరిసర ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించిన ఆయన మాట్లాడుతూ తారకరామానగర్ నుంచి రామలింగేశ్వరనగర్ వరకూ రిటైనింగ్ వాల్ నిర్మించి శాశ్వత విముక్తి కలిగించాలన్నారు. వరదపై ప్రభుత్వానికి ముందే సమాచారం ఉన్నా అందుకనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు మరింత నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. బాధితుల్లో కొద్ది మందికే పునరావాసం కల్పించారన్న ఆయన మిగిలిన వారిని పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. గతంలో 130 కోట్లతో నిర్మించిన రివిట్‌మెంట్ నిర్మాణం రామలింగేశ్వరనగర్, భూపేష్‌గుప్తానగర్, సుందర్యనగర్, తారాకరామానగర్, వరకూ కొనసాగించి ఉంటే ముంపు రాకుండా రక్షణ కవచంగా ఉండేదన్నారు. ప్రభుత్వం తక్షణమే సర్వే చేసి బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు లంకా దుర్గారావు, సంగుల పేరయ్య, తాడి పైడియ్య, ఈడే ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.