విజయవాడ

ఆరోగ్యవంత సమాజ నిర్మాణానికి బృహత్తర కార్యాచరణ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలందరికీ చక్కని వైద్య సౌకర్యాలు అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆయుష్మాన్ భారత్ - అందరికీ ఆరోగ్యం’ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ నెల 29న డా వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా విజయవాత నూతన ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అక్టోబర్ 1న విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా పది బెడ్‌ల చొప్పున ఏర్పాటు చేసే వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా పక్షోత్సావాల కాలంలో జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వైద్యాధికారులు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. తొలుత ఆయుష్మాన్ భారత్ - అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ర్యాలీలో పాల్గొన్న అధికారులు, విద్యార్థులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాలపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి రాఘవయ్య పార్కు వరకు సెంట్ ఆన్స్ విద్యార్థులు అధికారులతో కలిసి కలెక్టర్ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో అడిషినల్ డిఎంహెచ్‌ఓ డా జీ ఉషారాణి, డా షాలినీ, డా నాగేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుబ్రహ్మణ్యం, ఆరోగ్యశాఖ డిప్యూటీ కో-ఆర్డినేట్ డా సురేష్ తదితరులు పాల్గొన్నారు.