విజయవాడ

కుటుంబ పెద్దను కోల్పోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, సెప్టెంబర్ 16: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మరణం తనకెంతో బాధ కలిగించిందని జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ చెప్పారు. గద్దె రామ్మోహన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తమకు శ్రేయోభిలాషిగా, పెద్దదిక్కుగా ఉండేవారన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఉండగా కోడెల మరణ వార్త విని అందరం దిగ్భ్రాంతి చెందామన్నారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన మహిళా పార్లమెంట్ సదస్సులో ఆయనతో కలిసి పనిచేశామని, అనేకసార్లు స్పీకర్‌గా కృష్ణా జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని తమకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టినప్పుడు ముఖ్యఅతిథిగా కోడెల పాల్గొని విలువైన సూచనలు చేశారని గుర్తుచేశారు. కోడెల తనను కుమార్తెగా ప్రేమతో సంబోధించేవారని, ఆయన మృతిని జీర్ణించుకోలేక పోతున్నానన్నారు. పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో చేరి 6సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా, స్పీకర్‌గా పనిచేసిన కోడెల ఇంటికొచ్చి సాయం అడిగిన వారిని వట్టిచేతులతో వెనక్కి పంపిన దాఖలాలు లేవని అన్నారు. అలాంటి నేత మరణం తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని అంటూ ఆయన కుటుంబ సభ్యులకు అనూరాధ ప్రగాఢ సంతాపం తెలిపారు.
కోడెల మృతి కలచివేసింది
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు మరణం తనను కలచివేసిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కోడెల మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. సోమవారం అశోక్‌నగర్‌లోని పార్టీ కార్యాయలంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. అభిమానులు పల్నాటి పులిగా పిలుచుకునే కోడెల ఇటీవల వైసీపీ పాలనలో ఎదురవుతున్న రాజకీయ ఒత్తిళ్లపై నిత్యం పోరాటం చేస్తున్నారన్నారు. తీవ్రంగా వేధిస్తున్న వైకాపా ప్రభుత్వమే ముమ్మాటికీ ఆయన బలవన్మరణానికి కారణంగా తాను భావిస్తున్నానని గద్దె చెప్పారు. వైసీపీ పతనానికి ఇదే నాంది అని, కోడెల ఆత్మ వైకాపా పార్టీని భూస్థాపితం చేస్తుందని పేర్కొన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా కోడెల పార్టీకి ఎనలేని సేవలు అందించారన్నారు. కోటప్పకొండ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన మృతి టీడీపీతో పాటు తమ కుటుంబానికి తీరని లోటన్నారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు గద్దె సానుభూతి తెలిపారు.