విజయవాడ

శ్రీ చక్ర రాజ ఆధిష్ఠాన దేవత శ్రీ రాజరాజేశ్వరీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 9: చెరుకుగడను వామహస్తంతో ధరించి దక్షిణ హస్తంతో ఆభయాన్ని ప్రసాదించే శ్రీ షోడశాక్షరీ మహామంత్ర స్వరూపీణి, శ్రీ చక్రరాజ అధిష్ఠాన దేవతగా వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వరీదేవిని దర్శించుకోవటానికి భక్తులు మంగళవారం ఇంద్రకీలాద్రికి బారులు తీరారు. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందించే ఈచల్లని తల్లి దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంతో కనిపించే అపూర్వమైన ఈదేవతను దర్శించేందుకు చివరి రోజైన ఆశ్వయుజ విజయదశమి రోజైన మంగళవారం వేకువజాము నుండే భక్తులు పోటెత్తారు. శరన్నవ రాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీకనకదుర్గాదేవి శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. ఈవో ఎంవీ సురేష్‌బాబు ఆదేశాలతో వేకువజాము నుండే సహాయ ఈవో ఎన్ రమేష్ భక్తులకు ముఖమండప దర్శనం వరకే అనుమతించారు. శ్రీ మల్లిఖార్జున మహామండపంలో ఏర్పాటు చేసిన కుంకుమార్చనలో రెండు బ్యాచ్‌లు కలిసి సుమారు 250మంది దంపతులు పాల్గొన్నారు. చండీహోమంలో సుమారు 200 మంది దంపతులు పాల్గొన్నారు. ఈరెండు ఆర్జిత సేవల్లో పలువురు వీఐపీలు పాల్గొన్నారు. అనంతరం వీరిని ఒక ప్రత్యేక క్యూమార్గం గుండా అంతరాలయంలోకి పంపారు. వేకువజామున అమ్మవారి దర్శనం ప్రారంభం అయిన వెంటనే క్యూ మార్గాల్లోని భక్తులను పోలీసులను కొండపైకి అనుమతించారు. సోమవారం అర్ధరాత్రే నుంచే భక్తులు వివిధ క్యూమార్గాల్లో అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. కెనాల్‌రోడ్ వినాయకుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గంలోనికి ప్రవేశించిన భక్తులు రథం సెంటర్, శ్రీ విజయేశ్వర స్వామివారి దేవస్ధానం, దుర్గా ఘాట్, దర్గా సెంటర్ మీదుగా టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఐదు క్యూమార్గాల గుండా కొండపైకి చేరుకున్నారు. సిబ్బంది పాలు, టీ, వాటర్ ప్యాకెట్‌లను ఉచితంగా అందచేశారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు రాధాకృష్ణుల విగ్రహం వద్ద సిబ్బంది ప్రసాదాన్ని పంపిణీని చేశారు. తర్వాత మల్లిఖార్జునస్వామినిదర్శనం చేసుకుని మెట్లమార్గం గుండా కనకదుర్గనగర్‌కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్ వద్ద భక్తులు మహాప్రసాదాలలైన లడ్డూ, పులిహార కొనుగోలు చేసి ఎదురుగా ఉన్న నిత్యాన్నదాన కేంద్రంలో అన్న ప్రసాదాన్ని సుమారు 15వేల మంది భక్తులు స్వీకరించారు.
ముగిసిన దసరా మహోత్సవాలు
దుర్గగుడి కొండపై ఏర్పాటు చేసిన యాగశాలలో మంగళవారం ఉదయం ఈవో ఎంవీ సురేష్‌బాబు దంపతులు హోమగుండంలో పూజా సామగ్రి సమర్పించటంతో దసరా మహోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ శ్రద్ధతో ఈవో దంపతులను హోమగుండం ముందు కూర్చోబెట్టి నిష్ఠతో ప్రత్యేక పూజలు చేయించారు. గత నెల 29న ప్రారంభమై దసరా మహోత్సవాలు 9న పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.