విజయవాడ

పోలీసు కమిషనరేట్ స్పందనకు 136 పిటిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 14: స బ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన స్పందనకు 233 పిటిషన్లు అందాయి. అదేవిధంగా నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పందనకు 136 పిటిషన్లు అందాయి. కమిషనరేట్ పరిధిలోని జో న్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్టేషన్లలో నిర్వహించిన స్పందనకు 11 ఫి ర్యాదులు రాగా, పోలీసు కమిషనర్ కా ర్యాలయంలోని స్పందనకు 125 పిటిషన్లు వచ్చాయి. మొత్తం 136 ఫిర్యాదు ల్లో ఎక్కువగా నగదు లావాదేవీలకు సంబంధించి 42 ఫిర్యాదులు, భార్య భర్తలు, కుటుంబ కలహాలు వంటివి 30, సివిల్ వివాదాలు 22, మిగిలినవి ఇతర సమస్యలకు సంబంధించిన పిటిషన్లు ఉన్నాయి. కాగా పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు స్వయంగా స్పందన ద్వారా బాధితుల నుంచి పిటిషన్లు స్వీకరించిన మీదట వాటి పరిష్కారానికి వారం గడువు వి ధించి సంబంధిత పోలీస్టేషన్ల అధికారులకు ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్టేషన్లలో వచ్చిన స్పందన పిటిషన్లపై ఆరా తీసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే సబ్ కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన స్పందనలో అత్యధికంగా అర్బన్ హౌసింగ్ కింద 97 అర్జీలు, పెన్షన్ల కోసం 27, సివిల్ సప్లయిస్‌కు సంబంధించి 47, పోలీసుశాఖకు సంబంధించి 12, తహసీల్దార్ల పరిధిలో పరిష్కారం కోసం 24 ఇతర పరిష్కారం కోసం 26 దరఖాస్తులు అందినట్లు సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి ఏ మాధురి, వివిధ శాఖల డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.