విజయవాడ

టీటీసీ పరీక్ష ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 19: టెక్నికల్ టీచర్స్ సర్ట్ఫికెట్ (లోయర్ గ్రేడ్) పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఏ సుబ్బారెడ్డి తెలిపారు. ఆగస్టులో విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురం సెంటర్లలో నిర్వహించిన పరీక్షకు 2256 మంది అభ్యర్థులు హాజరుకాగా, 1997 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 88.52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వెబ్‌సైట్ నుండి ఫలితాల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.

ప్లాస్టిక్ నిషేధానికి సహకరిస్తాం
* బాటిళ్ల క్రషింగ్ మిషన్ ఏర్పాటు చేయండి * శ్రీ బాలాజీ స్వీట్స్ అధినేత సుబ్బారావు
విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 19: జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు చేస్తున్నామని, ప్లాస్టిక్ నిషేధానికి పూర్తిగా సహకరిస్తామని రమణయ్య కూల్ డ్రింక్స్ షాప్ సెంటర్‌లోని శ్రీ బాలాజీ స్వీట్స్ అధినేత కే సుబ్బారావు తెలిపారు. క్యారీ బ్యాగ్స్ నియంత్రించారు గానీ వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్ బాటిళ్లు ప్లాస్టిక్‌తోనే తయారవుతున్నాయని చెప్పారు. కొనే్నళ్ల క్రితం పండిట్ నెహ్రూ బస్టేషన్‌లో ఖాళీ బాటిళ్ల క్రషింగ్ మిషన్ ఏర్పాటు చేశారని, ప్రస్తుతం అది పనిచేయడం లేదని, అలాంటి క్రషింగ్ మిషన్లు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని సుబ్బారావు సూచించారు. మున్సిపల్ అధికారులు ఆ దిశగా అడుగులేస్తే క్రషింగ్ మిషన్లకు తనవంతు సాయం అందిస్తానని తెలిపారు. ప్రతి సెంటర్‌లోనూ ఖాళీ బాటిళ్ల క్రషింగ్ మిషన్స్ ఏర్పాటు చేస్తే తనవంతుగా సహకరించి ప్లాస్టిక్ నిషేధం కచ్చితంగా అమలు జరగడానికి సహాయం అందిస్తానని సుబ్బారావు వివరించారు.