విజయవాడ

వరకట్నంపై మహిళల్లో చైతన్యం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, అక్టోబర్ 19: వరకట్నం తీసుకోవటం చట్ట వ్యతిరేకమని, విద్యావంతులైన మహిళల్లో దీనిపై చైతన్యం వచ్చిందని, పల్లెల్లోనూ మహిళల్లో చైతన్యం రావాలని ఆరవ మెట్రోపాలిటిన్ కోర్టు మేజిస్ట్రేట్ బీ పద్మ పిలుపిచ్చారు. మండలంలోని యనమలకుదురు, సనత్‌నగర్‌లలో శనివారం జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సుల్లో వరకట్నం, బాల్య వివాహాలు, ఎఫ్‌ఐఆర్ నమోదు, తదితర అంశాలను ఆమె వివరించారు. మహిళల్లో చైతన్యం వచ్చినపుడే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని చెప్పారు. వరకట్నం తీసుకున్నా, ఇచ్చినా నేరమే అని తెలిపారు. ఏదైనా సమస్యపై ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధితులు తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించుకోవాలని సూచించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు వల్ల పోలీసులు తప్పనిసరిగా సమస్యను విచారించి బాధితులకు న్యాయం దక్కేలా చేస్తారన్నారు. బాల్య వివాహాల నివారణ పైనా జడ్జి పద్మ మహిళలకు అవగాహన కల్పించారు. సదస్సులలో సీఐ ముత్యాల సత్యనారాయణ, ఎస్‌ఐలు వరలక్ష్మి, దుర్గాప్రసాద్, న్యాయవాది కాశీపోగుల శివయ్య, పంచాయతీ కార్యదర్శి గంగాధరరావు, న్యాయ సేవాసమితి సభ్యుడు చిట్టూరి సుబ్బారావు పాల్గొన్నారు.