విజయవాడ

జారుడు రాళ్ల కిందుగా ప్రమాదభరిత ప్రయాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 19: సొరంగ మార్గం ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులపై రాళ్లు జారిపడుతున్నాయి. దానికి రెండువైపులా నిర్మించిన ఇటుక రాళ్లు పట్టుతప్పుతున్నాయి. సొరంగం పైనుండి కొండరాళ్లు జారిపడుతున్నాయి. నిత్యం వేలాది మంది ద్విచక్ర వాహనదారులు, వందలాది ఆటోలు, చిన్నకార్లు, మినీ లారీలు, బస్‌లు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 60ఏళ్ల క్రితం నిర్మించిన సొరంగ మార్గం తరువాత ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. సొరంగానికి చిట్టినగర్ వైపు, సితార సెంటర్ వైపు నిర్మించిన ఇటుకల గోడలు పూర్తిగా పట్టుతప్పాయి. పావురాల గూళ్లుగా మారాయి. పావురాలు వాలినా ఇటుకలు జారిపడుతున్నాయి. గత ఆగస్టు 17న సుమారు క్వింటా బరువైన కొండరాయి అటుగా వస్తున్న ఆటోపై దొర్లిపడిన ఘటనలో అదృష్టవశాత్తూ ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బండరాయి ధాటికి ఆటో ధ్వంసమైంది. రెండ్రోజుల క్రితం సితార సెంటర్ వైపు కొన్ని చిన్నచిన్న రాళ్లు దొర్లి రోడ్డుపై పడ్డాయి. ఒకరికి స్వల్ప గాయమైంది. సొరంగానికి ఇరువైపులా కొండపై నివాసముంటున్న వారు వాడిన మురుగునీటి వల్ల పైభాగానున్న కొండరాళ్లు పట్టు కోల్పోతున్నాయి. మురుగుకాల్వ సౌకర్యాలు సరిగ్గా లేనందున వాడిక నీరు సీతార సెంటర్ వైపు సొరంగం నుంచి నిత్యం ఊట ఊరినట్టుగా కిందికి వస్తోంది. సొరంగం మధ్యలోనూ నీరు ధారలా కారుతోంది. ఈ ఏడాది వర్షాలు ఎక్కువ కావడంతో ఇటుకలు, కొండరాళ్లు నానిపోయి, పట్టుతప్పి కిందికి జారుతున్నాయి. సొరంగానికి రెండువైపులా చెట్లు కూడా ఎప్పుడు కూలుతాయో అన్నట్లు ఊగిసలాడుతున్నాయి. పైన నివాసముండే వారు ఇష్టారాజ్యంగా చెత్తాచెదారాన్ని చెట్ల మొదళ్లలో పారేస్తున్నారు. దానివల్ల కొండరాళ్లు జారిపడుతున్నాయి. మొక్కలు వంగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో కొండపై పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇటుకలు తొలగించి సొరంగం పైభాగాన గోడలు పతిష్టంగా పునర్నిర్మించాలని, ప్రమాదకరంగా ఉన్న కొండరాళ్లను ముందుగానే తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.