విజయవాడ

కార్పొరేట్లకు మోదీ సర్కారు ఊడిగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట, అక్టోబర్ 22: జాతిపిత మహాత్మా గాంధీ ఆశీస్సులతో భోగరాజు పట్ట్భాసీతారామయ్య, చేతులమీదుగా 1928లో స్థాపించి 96ఏళ్లుగా రాష్ట్ర ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్న ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ఓబులేసు మద్దతు తెలిపారు. వన్‌టౌన్‌లోని రాజకుమారి థియేటర్ సమీపంలో ఆంధ్రా బ్యాంక్ జోనల్ ఆఫీసు వద్ద బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈసందర్భంగా శంకర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై కత్తిగట్టిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, కరవు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. ఓబులేసు మాట్లాడుతూ తెలుగువారి గౌరవానికి ప్రతీక ఆంధ్రా బ్యాంక్ అని, తెలుగు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం 96ఏళ్ల క్రితం స్వాతంత్ర సమరయోధులు పట్ట్భాసీతారామయ్య బందరులో ప్రారంభించిన బ్యాంక్ మెరుగైన సేవలు అందిస్తూ లాభాల బాటలో పయనిస్తోందని చెప్పారు. దీన్ని యూనియన్ బ్యాంకులో విలీనం చేయటాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో నగర సీపీఐ నాయకులు పల్లా సూర్యారావు, సీహెచ్ శ్రీనివాస్, డీవీ రమణబాబు, కేవీ భాస్కరరావు, కొట్టు రమణారావు, నక్కా వీరభద్రరావు, తూనం వీరయ్య, ఎండీ ఇక్బాల్, ఆర్ మెఖాయిల్, పగిడికత్తుల రాము, షేక్ సుభానీ, ప్రజానాట్య మండలి నాయకులు షేక్ నజీర్, డి సూరిబాబు, మహిళా సమాఖ్య నాయకులు దుర్గా, తదితరులు పాల్గొన్నారు.