విజయవాడ

సీఎం జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), నవంబర్ 19: రాష్ట్రంలోని అన్ని వర్గాల మద్దతుతో అఖండ మెజారిటీతో ఏకపక్షంగా సీఎం జగన్ ఎన్నికల్లో గెలిస్తే ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ షేక్ విమర్శించారు. టీడీపీ నేతల ఐదేళ్ల అరాచకాలకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పినా చంద్రబాబు ఇప్పటికీ కళ్లు తెరవడం లేదన్నారు. నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చట్టప్రకారం పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ప్రజలు ఫిర్యాదు చేయడం వల్లే పోలీసులు అరెస్టు చేశారని గుర్తుచేశారు. ఇదే సమయంలో ఆయన నిబంధనల ప్రకారం బెయిల్ పొంది బయటకు వచ్చారన్నారు. ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నిరంతరం పనిచేస్తున్న జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశంతో ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా, పోలీసు వ్యవస్థను కించపరిచేలా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా బాబు మాట్లాడటం బాధాకరమని ఖండించారు. సీనియర్‌గా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నేడు విచక్షణ కోల్పోయి దారుణంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో బాబు అండతోనే చింతమనేని రెచ్చిపోయి ఎందరిపైనో దాడులు చేశారన్నారు. చివరకు మహిళా తహశీల్దారుపై దాడి చేసినా బాబే రాజీ చేశారన్నారు. ప్రస్తుతం బాబు పరామర్శించాల్సింది టీడీపీ నాయకుల వల్ల నష్టపోయి కష్టపడుతున్న సామాన్యులను అని డా. మహబూబ్ షేక్ స్పష్టం చేశారు.