విజయవాడ

ఉపాధి హామీ పనుల అమలులో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 4: ఉపాధి హామీ పనుల అమలులో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేయాలని, ఇందుకు సంబంధిత అధికారులతో కలెక్టర్లు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి పథకం కింద ఉపాధి పనిదినాలను పెంచడం ద్వారా వౌలిక వసతులు పెంచాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెట్ జిల్లాలో తక్కువగా ఉన్నందున రాష్ట్ర స్థాయి నుంచి నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకున్నందుకు మంత్రి పెద్దిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు మూడు ప్రాధాన్యత అంశాలలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపిన కలెక్టర్ జిల్లాలో 349 భవనాలు అవసరం కాగా ప్రస్తుతం 65 భవనాలకు అంచనాలను రూపొందించామన్నారు. 22 కోట్లతో 63 భవనాలకు నిర్మాణ అనుమతులిచ్చామని, ఇళ్ల స్థలాల మెరక పనులకు త్వరిగతిన మంజూరు చేస్తామన్నారు. నాడు-నేడు కింద ఎంపిక చేసిన పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టామని వివరించగా, ఇందుకు మంత్రి పెద్దిరెడ్డి స్పందిస్తూ జిల్లాలో ఉపాధి హామీ కింద మెటీరియల్ కాంపోనెంట్‌కు ఇబ్బంది లేకుండా నిధులను కేటాయిస్తామని, చేపట్టిన పనుల్లో ప్రగతి చూపి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులలో వినియోగంలో లేని వాటికి తప్ప మిగిలిన ట్యాంకులకు రంగులు వేయించాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్ కార్యదర్శి గోపాలకృష్ణ దివ్వేది, కమిషనర్ గిరిజా శంకర్, తోపాటు జాయింట్ కలెక్టర్ -2 కే మోహనకుమార్, డ్వామా పీడీ సూర్యనారాయణ, డీపీఓ జే అరుణ, ఎస్‌ఈ అమరేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.