విజయవాడ

బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 10: తమ కార్యకర్తలపై భౌతికదాడులకు పాల్పడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని భాజపా హెచ్చరించింది. భాజపా నగర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పార్టీ విజయవాడ పార్లమెంట్ కన్వీనర్ కిలారు దిలీప్, బీజేవైఎం జాతీయ కార్యదర్శి పి సురేష్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆరు నెలలుగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని భాజపా కార్యకర్తలపై భౌతికదాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. బాధితులను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ కూడా వైఎస్‌ఆర్‌సీపీకి ఏజెంటుగా సహకరిస్తుందని విమర్శించారు. ఈ విషయాలపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఫిర్యాదులను భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌షా, సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు పంపిస్తున్నామన్నారు. భాజపా కార్యకర్తలపై బౌతికదాడులను తక్షణమే ఆపాలని, దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.