విజయవాడ

సైబర్ నేరాలపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, డిసెంబర్ 12: సైబర్ నేరాలపై మహిళలు అవగాహన ఉంటే జాగ్రత్తలు తీసుకోవటం చాలా సులభమని డీసీపీ వీ హర్షవర్థన రాజు అన్నారు. గంగూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల నందు జరిగిన సైబర్ మిత్రపై విద్యార్థులకు అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఆనంతరం డీసీపీ హర్షవర్థన రాజు మాట్లాడుతూ బలహీనతలను ఆసరా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఓటీపీ నెంబర్ తెలుసుకుని బ్యాంకు ఖాతాలోని నగదును ఖాళీ చేస్తున్నారన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో నగదు ఆఫర్ ఇచ్చి మోసం చేయటం వంటి సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని వాటిపై అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నప్పుడు సైబర్ నేరాలను నిరోధించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఆడపిల్లలు ఆటోలోగాని, టాక్సీలో గాని ప్రయాణించేటప్పడు యాప్‌ను అనుసంధానం చేయాలన్నారు. సాధ్యమైంత వరకు జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మహిళలు సంచరించాలన్నారు. ఎలాంటి అనుమానం వచ్చినా 100, 181, 182లకు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు. స్పందించలేని ఆడపిల్లల ప్రవర్తన చూసిన వారు తక్షణం మహిళ హెల్ప్‌లైన్‌కు ఎవరైనా సమాచారం అందించవచ్చని హర్షవర్థన రాజు అన్నారు. మహిళలకు ఎదురైన సమస్యలపై పోలీసులకు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు ఉన్న చట్టాలను ప్రతి మహిళ సద్వినియోగపర్చుకోవాలన్నారు. సైబర్ నేరాలపై మహిళలు అప్‌టేట్‌గా ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో ఏసీపీ నాగరాజు రెడ్డి, సీఐ ముత్యాల సత్యనారాయణ, ఎస్‌ఐలు వెంకటేష్, తమ్మినాయుడు, శైలజాకుమారి, దుర్గాప్రసాద్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు