విజయవాడ

ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయటం దైవత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట, డిసెంబర్ 15: ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయటం దైవత్వమే అవుతుందని, అటువంటి నిస్వార్థ సేవకులను సత్కరించుకోవటం హర్షణీయమని దేవాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విభిన్న రంగా ల్లో సేవలందిస్తున్న 100 మంది విశిష్ట వ్యక్తులను రూరల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనం గా సత్కరించారు. నగరంలోని మాకినే ని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఆదివారం జరిగిన ఈ ఆన్ సంగ్ హీరో స్ సత్కార సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజ సేవకులను సత్కరించుకోవటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రూరల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సొసైటీ వారు ఈ తరహా కార్యక్రమాలను మరి న్ని చేపట్టాలని మంత్రి సూచించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంగల ఈశ్వరయ్య మాట్లాడుతూ రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చ ని, రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్క రూ మనస్ఫూర్తిగా ముందుకు రావాల ని పిలుపునిచ్చారు. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ జీ ప్రశాంతి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి సేవలందిస్తున్న సన్మాన గ్రహీతలు అభినందనీయులన్నారు. రక్తదానం, అవయవదానం ప ట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణతో పా టు అనేక సామాజిక సేవ కార్యక్రమాల ను చేపడుతున్న రూరల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సొసైటీ ప్రతినిధులను డాక్టర్ ప్రశాంతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు జీ శ్రీ్ధర్, భాస్కర్, అడ్మినిస్ట్రేటర్ పిన్నమనేని కల్యాణి, సురేష్, దుర్గాకాంత్, తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు అండగా వైసీపీ ప్రభుత్వం
* శాసనసభ్యుడు మల్లాది విష్ణు
పాయకాపురం, డిసెంబరు 15: మహిళల భద్రతకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలవడమే కాకుండా దిశ చట్టం ద్వారా రక్షణ కల్పించడం జరుగుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం దిశ చట్టం రూపొందించి ఆమోదించినందుకు ఆదివారం ముత్యాలంపాడులోని వైఎస్‌ఆర్ విగ్రహం దగ్గర ఎమ్మెల్యే విష్ణు ఆధ్వర్యంలో మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడేవారు ఎంతటివారైనా సరే ఫాస్ట్‌ట్రాక్ ద్వారా 21రోజుల్లోపే విచారణ పూర్తిచేసి శిక్ష విధించడం జరుగుతుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మహిళల భద్రత కోసం సీఎం జగన్ ప్రత్యేక చట్టాన్ని రూపొందించి ఆమోదింపజేయడం అభినందనీయమన్నారు. హైదరాబాదులో జరిగిన ఘటనపై సీఎం జగన్ స్పందించి రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తగా మహిళల కోసం చట్టాన్ని రూపొందించడం ఆయన ముందుచూపునకు నిదర్శనమన్నారు. మహిళలపై అత్యాచారం, దాడులు చేయాలనే ఆలోచన చేయాలంటేనే హడలిపోయేలా చట్టం రూపొందించడం జరిగిందన్నారు. యావత్ మహిళాలోకానికి ఆత్మస్థైర్యం కల్పించేలా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మహిళా నాయకులు పిల్లి కృష్ణవేణి, ఒగ్గు సుజాత, మోత్కూరి శ్రీదేవి మాట్లాడుతూ సీఎం జగన్ మహిళల రక్షణకు చట్టం చేయడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఇంటి నుండి బయటకు వెళ్లిన మహిళలకు రక్షణ కరువైన నేపథ్యంలో ఇటువంటి చట్టం రావడం వల్ల మహిళలు నిర్భయంగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారన్నారు. నిర్భయ చట్టానికి దీటుగా దిశను రూపొందించారని కొనియాడారు. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకులు బంగా శకుంతల, విజయలక్ష్మీ, మారుతి, రాజ్యలక్ష్మీ, త్రివేణి, డివిజన్ అధ్యక్షులు సామంతపూడి చిన్న, పెన్మత్స సత్యం, తదితరులు పాల్గొన్నారు.