విజయవాడ

పోలీసుల వలయంలో బ్యారేజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, జనవరి 21: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రెండోరోజు కూడా ప్రకాశం బ్యారేజీ పోలీసుల వలయంలోనే ఉంది. మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ పిలుపు మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిన పోలీసులు సోమవారం తెల్లవారుజామునే భారీగా బ్యారేజీపై మోహరించి ఆందోళనకారుల నిరసన కార్యక్రమాలను నీరుగార్చారు. మంగళవారం కూడా పోలీసులు బ్యారేజీపై భారీగా మోహరించారు. గుంటూరు జిల్లా వైపు వాహనాలన్నింటినీ తనిఖీలు నిర్వహించారు. సరైన ఆధారాలు చూపించిన వారి వాహనాలను మాత్రమే గుంటూరు, అమరావతి వైపుకి బ్యారేజీ పైనుండి అనుమతించారు. తాడేపల్లి, సీతానగరం వెళ్లాల్సిన దంపతులను సైతం అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలను వెనక్కి మళ్లించారు. అలాంటి వారంతా కూతవేటు దూరంలోని తమ స్వగృహాలకు చేరుకోవాలంటే తిరిగి కనకదుర్గమ్మ వారధి బాట పట్టాల్సి రావడంతో పోలీసుల వింత ధోరణి పట్ల విసుగెత్తిపోయారు. కొందరైతే వాగ్వాదానికి దిగినాగానీ పైచేయి పోలీసులదే అయ్యింది. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై నీలిమ థియేటర్ సెంటర్‌లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. కొందరు నేతల పేర్లు, అధికారుల పేర్లు చెప్పి కార్లను ముందుకు దూకించినా గాని కుమ్మరిపాలెం సెంటర్‌లో ట్రాఫిక్ సీఐ ఎం సుధాకర్ బృందం అటకాయించారు. ఆటోలు, మినీ వ్యాన్‌లు, కార్లను కుమ్మరిపాలెం సెంటర్ మీదుగా విద్యాధరపురం, సితార సెంటర్, కబేళా సెంటర్ వైపుకి మళ్లించారు. పోలీసు అక్షరాలున్న ఓ కారుని పోలీసులు అటకాయించారు. ఆరాతీయగా అది పోలీసులది కాదని, ఫైర్ సిబ్బందిదని నిర్ధారించారు. పోలీసులు, అగ్నిమాపక శాఖకు మధ్య తేడా తెలుసుకుని కార్లకు స్టిక్కర్లు అంటించుకోవాలని, ఇలా అందరూ పోలీసు స్టిక్కర్లు వాడరాదని సీఐ సుధాకర్ గట్టిగా మందలించారు. కొందరు రాజకీయ నేతల పేర్లు, మరికొందరు గడువు ముగిసిన స్టిక్కర్లు అంటించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇలాంటి వారిని హెచ్చరించి వదిలేశారు.

గణతంత్ర దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
* సమీక్షలో జేసీ మాధవీలత
విజయవాడ (ఎడ్యుకేషన్), జనవరి 21: గణతంత్ర దినోత్సవాన్ని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించేందుకు అవసరమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కే మాధవీలత అధికారులకు సూచించారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి స్టేడియంలో ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్టస్థ్రాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటారన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వారికి సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సభా ప్రాంగణంలో నిరాటంకంగా విద్యుత్ సరఫరా కల్పించాలని, జనరేటర్లు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా అధికారులు ఆయా రాష్ట్ర శాఖ అధికారుల ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా, శానిటేషన్ పనులు చేపడుతున్నామన్నారు. రెవెన్యూ, పొలీస్, ప్రొటోకాల్ అధికారులతో సమన్వయ పరుచుకుని స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్-2 కే మోహనకుమార్, డీసీపీ హర్షవర్ధన్‌రాజు, సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.