విజయవాడ

పోలీసు ‘స్పందన’కు 116 ఫిర్యాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 27: పోలీసు కమిషనరేట్ పరిధిలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో 116 ఫిర్యాదులు అందాయి. ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలో భాగంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక దృష్టికి వచ్చిన ప్రతి పిటిషన్‌ను జాయింట్ పోలీసు కమిషనర్ డి నాగేంద్రకుమార్ స్వయంగా పరిశీలించారు. కమిషనరేట్ పరిధిలోని జోన్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో నిర్వహించిన స్పందనకు తొమ్మిది ఫిర్యాదులు రాగా, పోలీసు కమిషనర్ కార్యాలయంలో జరిగిన స్పందనకు 107 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు, జోన్లు, సర్కిల్ కార్యాలయాల్లో నిర్వహించిన స్పందనకు సంబంధించి జాయింట్ పోలీసు కమిషనర్ నాగేంద్రకుమార్ కమిషనర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిటిషన్లపై ఆరాతీసిన మీదట వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా కమిషనరేట్‌లో జరిగిన స్పందనకు వచ్చిన బాధితులతో స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిటిషన్లు క్షుణ్ణంగా పరిశీలించి వాటిని తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 116 ఫిర్యాదుల్లో ఎక్కువగా 39్ఫర్యాదులు నగదు లావాదేవీలకు సంబంధించినవి కాగా 29-్భర్య భర్తలు, కుటుంబ కలహాలు, 17-సివిల్ వివాదాలు, 15-మోసాలు, 13-ఇంటి పక్కవారితో, చిన్న చిన్న తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు, 3-దొంగతనాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.

దివంగత ఐపీఎస్ వ్యాస్‌కు
కమిషనరేట్ ఘన నివాళి
విజయవాడ (క్రైం), జనవరి 27: సీనియర్ ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ 27వ వర్ధంతి సందర్భంగా నగర పోలీసు కమిషనరేట్ ఘన నివాళి అర్పించింది. వ్యాస్ వర్ధంతిని పురస్కరించుకుని నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నేతృత్వంలో బందరు రోడ్డులోని కేఎస్ వ్యాస్ కాంప్లెక్స్ వద్ద ఉన్న విగ్రహానికి అధికారులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వ్యాస్ చేసిన సేవలను ఈసందర్భంగా స్మరించుకుని రెండు నిముషాలు వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ టి నాగరాజు, సిఎస్‌డబ్ల్యూ డీసీపీ ఏబిటిఎస్ ఉదయరాణి, స్పెషల్ బ్రాంచి ఏడిసిపి నవాబ్‌జాన్, హెడ్ క్వార్టర్స్ ఏసీపీ చెంచురెడ్డి, పరిపాలనా విభాగం ఏఓ టి రంగారావు, ఏసీపీలు, సిఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.