విజయవాడ

సిటీ సైబర్ సెల్‌కు ఐఎస్‌ఓ గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 18: నగర పోలీసు కమిషనరేట్‌లోని సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‌కు అంతర్జాతీయ సర్ట్ఫికెట్ లభించింది. ఐఎస్‌ఓ గుర్తింపు లభించడం సంతోషకరమని పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. మంగళవారం సాయంత్రం సైబర్ పోలీస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిషనరేట్‌లో తొలి ఐఎస్‌ఓ గుర్తింపు నున్న పోలీస్ స్టేషన్‌కు లభించిందని, రెండో గుర్తింపు సర్ట్ఫికెట్ సైబర్ స్టేషన్‌కు రావడం సంతోషమన్నారు. నగరంలో 2018 ఆగస్టులో ఈ స్టేషన్ ఏర్పాటు చేశామని, నాటి నుంచి సత్పలితాలు వస్తున్నాయన్నారు. నేరం జరగకుండా ఆపాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. కొన్ని సందర్భాల్లో కేసు నమోదు కాకముందే చేధించిన ఘటనలు లేకపోలేదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం కారణంగా ఐఎస్‌ఓ సర్ట్ఫికెట్ వచ్చిందన్నారు. సైబర్ స్టేషన్ సిఐ కె శివాజీ ఆయన సిబ్బందికి అభినందనలు తెలిపారు. సైబర్ క్రైం శాతం చాలావరకు తగ్గిందని, అయితే నేర నియంత్రణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాలెట్ వాడే వారు నేరం జరిగిన వెంటనే సైబర్ క్రైం పోలీసులను సంప్రదిస్తే న్యాయం చేయగలమన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రికవరీ 40శాతం పెరిగిందని, నగరంలో సైబర్ క్రైం రెండో ఐఎస్‌ఓ గుర్తింపు స్టేషన్ కాగా, ఇక అన్ని పోలీస్టేషన్లకు కూడా ఐఎస్‌ఓ గుర్తింపు వచ్చే దిశగా కృషి చేస్తామని సీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, క్రైం డీసీపీ డి కోటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన డీసీపీ
పెనమలూరు, ఫిబ్రవరి 18: శివరాత్రి నాడు ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఉత్సవాల వేడుకలకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను డీసీపీ హర్షవర్థన్ పరిశీలించారు. 21న యనమలకుదురు శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం నందు జరిగే ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లలో భాగం డీసీపీ హర్షవర్థన్ స్వామిని మంగళవారం దర్శించారు. అనంతరం పరిసరాలను పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు అందించారు. ప్రభలు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపుల్లో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డీసీపీ అధికారులకు వివరించారు. ఈకార్యక్రమంలో ఏసీపీ నాగరాజు రెడ్డి, సీఐ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.