విజయవాడ

రాష్ట్రానికివి చీకటి రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (గాంధీనగర్), ఫిబ్రవరి 22: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని జరుగుతున్న ఆందోళనలతో గత రెండు నెలలుగా రాష్ట్రానికి చీకటి రోజులు వచ్చాయని, అమరావతినే రాజధానిగా ప్రకటించేంత వరకు ఉద్యమం ఆగదని ధర్నాలో వక్తలు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యాన ధర్నాచౌక్ సెంటర్‌లో శనివారం నుండి రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ ఎ శివారెడ్డి మాట్లాడుతూ గత 60రోజులగా రాజధాని ప్రాంత రైతులు పోరాటాలు చేస్తున్నారని, వారికి మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు చెప్పారు. ఏకపక్షంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రం మూడు ముక్కలైందన్నారు. ఏఒక్కరూ మూడు రాజధానుల విషయంపై సంతృప్తిగా లేరని చెప్పారు. ధర్నాలో క్రెడాయ్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలో ముఖ్యమంత్రి జగన్‌తో ఎవరినీ పోల్చలేమని, ఆయన పోకడ బాగోలేదన్నారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పాడని, ఎన్నికైన దగ్గర నుండి ఎవరికీ మంచి చేసింది లేదని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని అనేది ఉంటుందా అని ప్రశ్నించారు. ఐదేళ్లకు ఒకసారి రాజధానిని మారుస్తారా అంటూ ఆవేదన వ్యక్తపరిచారు. అనేక కారణాల వల్ల నిర్మాణ పనులు 9నెలలుగా ఆగిపోయాయని వాపోయారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఈ ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. ధర్నాలో క్రెడాయ్ నాయకులు వైవీ రమణ, మోహన్‌రావు, రవికుమార్, ఎం సాయిబాబు, శ్రీ్ధర్, సుధాకర్, ఫణికుమార్, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.