విజయవాడ

సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ఎస్సీలకు చేయూతనందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 25: పేదరికంలో ఉన్న ఎస్సీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ఆర్థిక ప్రగతికి చేయూతనందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కే రాములు చెప్పారు. మంగళవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధ్యక్షతన జిల్లాలో ఎస్సీలకు అమలు చేస్తున్న పథకాలపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో శాఖల వారీగా అమలవుతున్న అంశాలు, వాటిపై వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మాచవరంలో రూ. 1.45కోట్ల వ్యయంతో అంబేద్కర్ భవనాన్ని పూర్తిస్థాయిలో త్వరితగతిన నిర్మించాలన్నారు. ఎస్సీలకు సంబంధించిన కమ్యూనిటీ భవనాలు, ఇతర భవనాలు 80శాతం పూర్తయి నిధులు లేకపోతే సాధారణ నిధులను వినియోగించి పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో ఎస్సీలకు నూరురోజులు పనిదినాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాములు ఆదేశించారు. డీఆర్‌డీఏ పీడీ వివరణ ఇస్తూ జిల్లాలో 4,00,600 జాబ్‌కార్డులు అందించామని, ఎస్సీ, ఎస్టీ ఎక్కువగా ఉన్న తిరువూరు, ఏ కొండూరు ప్రాంతాల్లో ఎస్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. సివిల్ సప్లయి అధికారులు మాట్లాడుతూ జిల్లాలో 12.92 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, 2,354 రేషన్‌షాపులు ఉండగా ఇందులో ఎస్సీలకు సంబంధించి 628 ఉన్నాయన్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు అందిస్తున్న బియ్యం, ఆరోగ్యశ్రీ ఇతర కార్డులకు ఆధార్ అనుసంధానం చేశామని తెలిపారు. జిల్లాలోని 3619 అంగన్‌వాడీ, 193 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కింద మొదటి విడతగా రూ. 20 కోట్లు వ్యయంతో 1237 పాఠశాల్లో వౌలిక సదుపాయాలు, భవనాలు లేనిచోట్ల నూతన భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుందని డీఈవో వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాధవీలత, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సీపీ ద్వారకాతిరుమలరావు, ఎస్పీ రవీంద్రబాబు, జేసీ-2 మోహన్‌కుమార్, డీఆర్వో ఏ ప్రసాద్, సాంఘీక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.