విజయవాడ

నేరగాళ్లను గుర్తించేందుకు.. సరికొత్త నిఘా కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 25: నేరాలను అదుపు చేయటంలో భాగంగా అధునాతన టెక్నాలజీ వినియోగానికి నగర పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. నేరాలను సమర్థవంతంగా అరికట్టడానికి మొబైల్ ఇడెంటిఫికేషన్ డివైస్’ అనే అత్యాధునిక పరికారాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా నేరస్తులను అక్కడికక్కడే పట్టుకుని, తద్వారా కేసులను వేగంగా ఛేదించడంతో పాటు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఈ పరికరం దోహదపడనుంది. కమిషనరేట్ పరిధిలో అనుమానితులు, చోరులు, ఇతర నేరాలకు పాల్పడేవారిని గుర్తించేందుకు ఇప్పటికే ఉన్న అవకాశాలతో పాటు అదనంగా పోలీసు శాఖ ఈ కొత్త పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకురానుంది. నేరం చేసిన, చేసేందుకు ప్రయత్నించేవారిని గుర్తించేందుకు కేవలం వారి వేలిముద్రల ఆధారంగా సెల్‌ఫోన్ సాయంతో నేరస్తుడా, కాదా? అనేది క్షణాల్లో తేల్చనున్నారు. రాత్రివేళల్లో గస్తీ నిర్వహించే పోలీసు సిబ్బందికి ‘మొబైల్ ఐడెంటిఫికేషన్ డివైస్’ను ఇవ్వనున్నారు. అనుమానితులు తారసపడితే వెంటనే వారి వేలిముద్రల ద్వారా నేరస్తులను గుర్తించే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇందులో పొందుపర్చారు. నగరంలో ఎక్కడి నుంచి అయినా అనుమానితుల వేలిముద్రలను ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్ ద్వారా పంపిన నిముషంలోనే గతంలో వారిపై నమోదైన కేసుల వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. దీనిద్వారా రాష్టవ్య్రాప్తంగా చోరీలకు పాల్పడే ముఠాలను సులువుగా గుర్తించవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చోరీలకు పాల్పడిన వారు ఇక్కడికి వచ్చి సంచరించినా ఇట్టే దొరికిపోతారు.
పనితీరు ఇలా..
రాత్రివేళ నిఘాలో ఉండే బీట్ కానిస్టేబుల్‌కు ఈ పరికరాన్ని అందిస్తారు. పోలీస్టేషన్ పరిధిలో ఎవరైనా అనుమానితుడు తారసపడితే అతని వేలిముద్రలను సెల్‌ఫోన్‌కు అనుసంధానమైన మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ (ఎంఎస్‌సీడీ) ద్వారా సేకరించగానే అవి కంప్యూటర్ సర్వర్‌కు చేరతాయి. సదరు వ్యక్తిపై గతంలో ఉన్న కేసులు, వాటికి సంబంధించిన వివరాలు క్షణాల్లో సెల్‌ఫోన్‌లో ప్రత్యక్షమవుతాయి. వ్యక్తి వివరాలు, ఫొటో, అతనిపై నమోదైన కేసులు, ఏ ప్రాంతం వాడు వంటి వివరాలు తెలుసుకోవచ్చు. దీనిద్వారా అనుమానితుడిని అదుపులోకి తీసుకుని వెంటనే సమీప పోలీస్టేషన్‌కు తరలిస్తారు. ఒకవేళ ఎలాంటి కేసులు లేకపోతే ‘నో డేటా ఫౌండ్’ అని వస్తుంది. అలాంటి వారిని వదిలేస్తారు. ఈ నూతన విధానం ద్వారా రాత్రివేళ నిఘా ముమ్మరం కానుంది. చోరీల నివారణకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. అనుమానితులపై ప్రత్యేకంగా దృష్టిసారించే వీలుంటుంది.