విజయవాడ

జనతా కర్ఫ్యూలో పాల్గొనే సిబ్బందికి స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 21 కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనే పీటీడీ సిబ్బందికి స్పెషల్ క్యాజువల్ లీవు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైరస్ వ్యాప్తి కారణంగా నిలిపివేస్తున్న సర్వీసుల మిగులు సిబ్బందిని వేరొక సర్వీసులకు పంపించడం లేదా వారికి కూడా స్పెషల్ క్యాజువల్ లీవు మంజూరు చేయాలంటూ శనివారం రాష్ట్ర రవణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్యకు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. అతి భయంకరమైన కరోనా వైరస్ కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈనెల 22న ప్రభుత్వం చెపడుతున్న జనతా కర్ఫ్యూలో పాల్గొనే సిబ్బంది అందరికీ స్పెషల్ క్యాజువల్ లీవు మంజూరు చేయాలన్నారు. అలాగే కరోనా ప్రభావంతో పుణ్యక్షేత్రాలైన తిరుమల, తిరుపతి, సింహాచలం తదితర డిపోలలో బస్సుల రద్దు కారణంగా డ్యూటీలు నిలుపుదల చేసిన సిబ్బందికి, అలాగే ఇతర డిపోలలో వైరస్ ప్రభావంతో నిలిపివేస్తున్న సర్వీసుల సిబ్బందికి కూడా ఎన్ని రోజులు ఆయా సర్వీసులు నిలుపుదల చేస్తే అన్ని రోజులు వారి వద్ద సంతకాలు తీసుకుని ఇతర విధులకు ఉపయోగించుకోవాలన్నారు. అది సాద్యపడని యెడల బలవంతంగా సిబ్బందికి శెలవులు రాయకుండా వీరందిరకీ స్పెషల్ క్యాజువల్ లీవులు మంజూరు చేసి ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని వినతి పత్రంలో మనవి చేశారు.

కరోనా వైరస్‌ను నివారిద్దాం
* జనతా కర్ఫ్యూను పాటిద్దాం* కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్
విజయవాడ (ఎడ్యుకేషన్), మార్చి 21: జిల్లాలో ఈనెల 22న ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ కోరారు. జనతా కర్ఫ్యూపై శనివారం కలెక్టర్ ఇంతియాజ్ జనతా కర్ఫ్యూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలో భాగంగా ఆదివారం జనతా కర్ఫ్యూను పాటిద్ధామని, జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతం చేసేందుకు ప్రతి ఒకరు సహకరించాలని పేర్కొన్నారు. ఈనెల 22న ఆదివారం ఉదయం 7గంటల నుండి రాత్రి 9గంటల వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. జనతా కర్ఫ్యూకు ప్రతి ఒక్కరం సంఘీభావం ప్రకటిద్దామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపును జయప్రదం చేసి కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేద్దమన్నారు.