విజయవాడ

వ్యాపారులకు వరంగా మారిన కరోనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, మార్చి 21: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తో ప్రజలు కలవరపాటుకు గురవుతుంటే కొంత మంది వ్యాపారులకు కరోనా వైరస్ వరంగా మారగా ప్రజలకు మాత్రం శాపంగా మారింది. కరోనా బారిన పడుకుండా ప్రజలు ముందస్తు రక్షణగా మాస్క్‌లు, చేతిగ్లౌజుల కోసం పటమట, గుణదల, అటోనగర్, కృష్ణలంక తదితర ప్రాంతాలలో మెడికల్ షాపుల ముందు బారులు తీరుతున్నారు. అయితే ప్రజల అవసరాన్ని గుర్తించిన కొంత మంది వ్యాపారులకు మాస్క్‌లు, చేతి గ్లౌజులు కాసుల వర్షం కరిపిస్తున్నాయి. అంతకుముందు సాధారణంగా మార్కెట్‌లో ఒక్కొక్క మాస్క్ ధర 1.60 పైసల నుండి రూ.5ల వరకు వ్యాపారులు విక్రయించేవారు. కరోనా ప్రభావంతో మాస్క్‌లకు డిమాండ్ పెరగటంతో కొంత మంది వ్యాపారులు ప్రస్తుతం ఒక్కొక్క మాస్క్ ధరను రూ.17ల నుండి రూ.25ల వరకు విక్రయిస్తున్నారు. బతికుంటే బలుసాకులు తిని బతకవచ్చు అన్న చందంగా చేసేదేమీలేక ప్రజలు ఎక్కువ ధర అయినా మాస్క్‌లను కొనుగోలు చేస్తున్నారు. గతంలో చేతి గ్లౌజుల ధర ఒక్కొక్కటి రూ.5లు ఉండగా కరోనా ఎఫ్‌క్ట్‌తో కొంత మంది మెడికల్ షాపుల యజమానులు గ్లౌజ్ ధరను నేడు రూ.10ల నుండి రూ.15ల వరకు విక్రయిస్తున్నారు. ఇంత అధిక ధరలకు విక్రయిస్తున్నారేంటని ప్రజలు మెడికల్ యజమానులను ప్రశ్నిస్తుంటే అసలు మార్కెట్‌లో మాస్క్‌లు ఎక్కడ దొరకుతున్నాయని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని అంటున్నారని వారు తెలిపారు. ఇంతగా అధిక ధరలకు మార్కెట్‌లో మాస్క్‌లు, గ్లౌజులు విక్రయిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జనతా కర్ఫ్యూను ఉద్యమంలా విజయవంతం చేద్దాం
* ఉద్యోగులకు ఏపీ జేఏసీ పిలుపు

విజయవాడ, మార్చి 21: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిరోధంకై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం జనతా కర్ఫ్యూని పాటించాలంటూ ఇచ్చిన పిలుపును రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షన్‌లందరూ చిత్తశుద్ధితో ఒక ఉద్యమంగా స్వీకరించి ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లలోనే ఉండి విజయవంతం చేయాలంటూ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ వైవీ రావు ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ అతి భయంకరమైన వైరస్‌ను మన దేశానికి విస్తరించకుండా అరికట్టడానికి మనమంతా బాధ్యతగా పోరాడాదామన్నారు. ప్రస్తుతం కరోనా రెండో దశలో ఉన్నందున ఈ నెల 31వ తేదీ వరకు విద్యా సంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించినందున ఈ పది రోజులపాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం కలుగచేయాలని కోరుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్వయంగా లేఖలు అందజేసామన్నారు. ఒక వేళ అందరికీ ఒకేసారి ఇవ్వటానికి ఏమైన ఇబ్బంది ఉండే కనీసం మహిళా ఉద్యోగినులకు అవకాశం కల్పించాలన్నారు. ఇక ఉద్యోగులందరూ తమ తమ కార్యాలయాల్లో తమతమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సాధ్యమైనంత మేర ఎవరికీ షేక్ హ్యాండ్‌లు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.