విజయవాడ

కరోనా.. జనం హైరానా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 21: ఆదివారం పాటించనున్న ప్రజా కర్ఫ్యూ తో ప్రజలలో కొంత హైరానా ఉన్నా, పాటింపునకు ప్రజలు అన్నీ సి ద్ధం చేసుకుంటున్నారు. ఇటు ఇళ్లలోనే కాక బయట ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ఈ శతాబ్దంలోనే కాక గతంలో ఎన్నడూ ఈ విధంగా జరిగిందన్న దాఖలాలు లేవనే చెప్పాలి. దీంతో ఆదివారం జరుగుతున్న జనతా కర్ఫ్యూపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం అవసరమైయ్యే పాల ప్యాకెట్ నుంచి రాత్రి నిద్రించే ముందు వేసుకునే మందులు, ఇతర అవసరాల వరకూ అవసరమైన సాధనాలు, ఉపకరణాల ను సిద్ధం చేసుకుంటున్న వైనంతో శనివారం మార్కెట్ పరిసరాలన్నీ హడావుడిగా కనిపించాయి. నిత్యావసరాలైన పాలు, కూరగాయలు, అల్పాహార ప దార్థాలు తదితరాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైన ప్రజలు, ఎక్కడికి వెళ్లినా ఇదే చర్చలు జరుపుకుంటున్న వైనం గమనార్హం. కూరగాయల మా ర్కెట్లు, రైతు బజార్లలో వినియోగదారుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం పె్ర టోల్ బంకులకు సెలవంటూ సమాచా రం గుప్పుమనడంతో వాహనచోదకు లు పెట్రోల్ కోసం బంకులలో బారు లు తీరిన వైనం కనిపించింది. అసలు బయటకు ఎక్కడికీ వెళ్లేది లేదని చెబుతుంటే ఇక వాహనాల్లో ఆయిల్ ఎందుకన్న కనీస ఆలోచన చేయకుండా ఆ యిల్ కోసం బంకుల్లో బారుల తీరిన జనాన్ని చూసి అందరూ విస్మయం చెందారు. ఇదిలా ఉండగా ఆదివారం క్రైస్తవులు చర్చిలలో జరుపుకునే ప్రార్థనలను ఉదయం వేళల్లో కాకుండా తెల్లవారుఝామున 4గంటల నుంచి ఐదున్నర గంటల కల్లా ముగించే విధంగా ఆరాధన ఏర్పాట్లు చేసుకోగా, కొన్ని చర్చిల వారు ఆదివారం ఉదయం ఆరాధనలను రద్దు చేసుకోవడం విశేషం. కరోనాపై జరుగుతున్న విస్తృత ప్రచారంతో ప్రజల్లో కొంత కదలిక వచ్చింది. మాస్క్‌లు, శానిటైజర్లు, ఇతర ఔషదాల కోసం మెడికల్ షాపులలో కొనుగోళ్లు పెరిగాయి. ప్రజల అవసరాలను గుర్తించిన మందుల వ్యాపారులు వాటిని ఎంఆర్‌పీ రేట్ల కన్నా ఎక్కువగా అమ్మకాలు చేయగా, మరికొన్ని షాపుల్లో అవి అందుబాటులో లేకపోవడం ఒకింత విచారం కలిగించాయి. వీఎంసీ ప్రజారోగ్య అధికారులు కరోనా నియంత్రణలో చేపడుతున్న వివిధ చర్యలను ముమ్మరం చేశారు. పరిసరాల పరిశుభ్రత, నియంత్రణ చర్యలపై ప్రచారం, విదేశీయుల రాక లపై నిఘా వంటి చర్యలపై దృష్టిసారించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జన సాంద్రత ఎక్కువగా సంచరించే చర్యలను నివారించే చర్యల్లో భాగంగా వీఎంసీ స్టేడియంలలో జరిగే వాకింగ్, స్విమ్మింగ్ పూల్స్‌లను కూడా ఈనెలాఖరు వరకూ మూసి వేయడంతో వాకర్స్ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.