విజయవాడ

జనతా కర్ఫ్యూను ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 21: దేశ వ్యాప్తంగా ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, నగర పాలక సంస్థ చేపడుతున్న జాగ్రత్త చర్యలకు ప్రజలందరూ సహకరించడమే కాకుండా ఆదివారం చేపట్టనున్న జనతా కర్ఫ్యూను స్వచ్చంధంగా పాటించాలని జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ ఏఎండి ఇంతియాజ్, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈమేరకు నగరంలోని వివిధ వ్యాపార సంస్థలు, రెసిడెన్షిల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో శనివారం వీఎంసీ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సమావేశంలో తొలుత కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలను వివరిస్తూ, జిల్లాకు వచ్చిన 908 మందిని హౌస్ ఐసోలేషన్‌లో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు విదేశాల నుంచి వచ్చిన వారిపై దృష్టిసారించి నగరంలో అధిక సాంధ్రత ఉండే మాల్స్, షాపింగ్ కాంప్లెక్సు, సినిమా థియేటర్స్, వంటి వాటిని ఈనెలాఖరు వరకూ మూసివేయాలనే సూచనలిచ్చామన్నారు. అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ జనతా కర్ఫూ పాటించాలన్న సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. హాస్పటల్స్, మిల్క్‌బూత్, మెడికల్ షాపులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్న కలెక్టర్ సోమవారం నుంచి 31వ తేదీ వరకూ అధిక సాంధ్రత కలిగి ఉండే అన్ని కాంప్లెక్సులు, పెద్ద షోరూమ్‌లు, సూపర్ మార్కెట్, మాల్స్‌లను కూడా మూసివేయాలని సూచించారు. ప్రజల రద్దీ తక్కువగా ఉన్న నిత్యావసర వస్తువులు విక్రయించే చిన్న షాపుల వారు తగిన జాగ్రత్తలతో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణ సామాజిక బాధ్యతగా తీసుకుని కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. నగర పాలక సంస్థకు సంబంధించి అన్ని స్టేడియంలు, స్విమ్మింగ్ పూల్స్, వంటి వాటిని కూడా ఈనెల 31వ తేదీ వరకూ మూసివేస్తున్నట్టు తెలిపారు. 100 మంది స్వచ్చ గ్రహీలను ప్రత్యేకంగా ఏర్పాటుచేశామని తెలిపిన ఆయన వారు నగరంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసిన వారిని సెల్ ఫోన్ ద్వారా ఫోటో తీసి మొబైల్ కోర్టు ద్వారా వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

రైల్వేస్టేషన్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
* థర్మో స్క్రీనింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలి * కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్
విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 21: రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్ తదితర రద్దీ ప్రాంతాల్లో కరోనా నిరోధక చర్యల్లో ఎటువంటి అలసత్వం వద్దని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆదేశించారు. రైల్వేస్టేషన్‌ను శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ డా కే మాధవిలత, సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అనుపమ, రైల్వే అధికార బృందంతో కరోనా నియంత్రణ ఏర్పాట్లను ఆకస్మీత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనిడ్ 19 వ్యాప్తి నిలోదానికి ప్రధానంగా ప్రజారద్దీ ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. విజయవాడ వంటి రద్దీ కలిగిన రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న హ్యాండ్‌వాష్ ఏర్పాట్లకు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రైల్వేస్టేషన్‌లో ఒక ప్రాంతంలోనే ధర్మో స్క్రీనింగ్ ఏర్పాటు చేశారని అయితే స్టేషన్‌లోకి వివిధ మార్గాల ద్వారా ప్రవేశించే వారు, రైలు దిగి బయటకి వెళ్లే ప్రయాణికులను పరీక్షించే ఏర్పాట్లు చేయాలన్నారు. స్టేషన్‌లో ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది ప్రయాణికులు గుమికూడి ఉండకుండా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు కలెక్టర్ సూచించారు. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు మినహా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు అందరు ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొంటారన్నారు.