విజయవాడ

కరుణ లేని కరోనా కట్టడికి నడుంకట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: యావత్ ప్రపంచం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్న తరుణంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనావస్థకు చేరుతూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్న ఈ సమయంలో అకుంఠిత దీక్షతో మొత్తం మానవజాతి మహాయుద్ధానికి సిద్ధం కావాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆత్మరక్షణ, ఆరోగ్య క్రమశిక్షణ అనే రెండే అంశాలు ప్రస్తుతం మన ఆయుధాలని తెలిపారు. శత్రువు మనకన్నా కొన్ని వేల రెట్లు శక్తిమంతమైనప్పుడు ఆత్మరక్షణ అసలైన యుద్ధ వ్యూహమని, కరోనాపై యుద్ధంలో ఆత్మరక్షణే ప్రధాన ఆయుధమన్నారు. ఒక్క 10రోజులు మనం బయటికి వెళ్లకపోతే పెద్ద నష్టాలు జరిగిపోవని, మనం బయటకి వెళ్లి పనిచేయకపోతే ఏవో ఉత్పాతాలు జరిగిపోతాయని అనుకోవటం వివేకం కాదని ఆయన పేర్కొన్నారు. నిర్లక్ష్య భావంతో బయట తిరగటం, వేడుకలు, సంబరాలు, సామూహిక పార్టీల పేరిట సమూహంతో కలిసి విజ్ఞత మరిచి చేసిన పొరపాట్ల వల్లే అనేక దేశాల్లో చెప్పటానికి వీరులేనంత కష్టం జరిగిందని గుర్తుచేశారు. ఇంకా ప్రాణనష్టం జరుగుతూనే ఉందని తెలిపారు. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవడం, కళ్లు, నోరు, ముక్కు జాగ్రత్తగా శుభ్రంగా ఉండేలా చూసుకోవడం, సమూహంలో కలవకపోవడం వంటి జాగ్రత్తలు అందరికీ తెలిసినవే అయినా విపత్కర సమయంలోనూ పాటించడం లేదన్నారు. ఆరోగ్య క్రమశిక్షణ లేకపోవడమే దీనికి కారణమన్నారు. క్రమశిక్షణా రాహిత్యమే ఈ సమస్య ఇంతగా వ్యాప్తి చెందటానికి కారణంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రతిఒక్కరూ దృఢ సంకల్పంతో ఆత్మరక్షణ, ఆరోగ్య క్రమశిక్షణ పాటించాలని కోరారు. అలుపెరగక సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి జయశేఖర్ ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.