విజయవాడ

31 వరకు లాక్ డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట, మార్చి 22: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా అంతటా 31 వరకు 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోనికి వస్తాయన్నారు. నలుగురైదుగురూ ఎక్కడా గుమికూడ రాదు ఉల్లఘించిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతాయన్నారు.
అభినంధనలు
ప్రపంచానే్న గడగడలాడించిన కరోనా వైరస్ నియంత్రణలోని మన వైద్య, పారిశుద్ద్య, పోలిస్‌శాఖ తదితరులు ప్రజలకు అందిస్తున్న సేవలకు కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అభినందనలు తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపుకార్యాలయంలో ఆదివారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత, వియంసీ కమిషనర్, వి ప్రసన్న వెంకటేష్, విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అనుపమలతో కలిసి కలెక్టర్ ఇంతియాజ్ చప్పట్లతో సిబ్బందిని అభినందించారు.ప్రజలు ఎంతో సంకల్ప బలంతో కర్ప్యూలో పాల్గొని విజయవంతం చేసారన్నారు. ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారన్నారు. వైద్యులు, సిబ్బంది, పోలిసులు తదితరులు ఇటువంటి పరిస్ధితిలో ప్రజలకు సేవలందించి కరోనా నియంత్రణలో భాగమైనందుకు ధన్యవాదాలు తెలిపారు.