విజయవాడ

టిడిపికి చిత్తశుద్ధి ఉంటే ఎన్టీయే నుండి బయటకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: ఏపికి ప్రత్యేక హోదా రప్పించే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి, ఎన్టీయే కూటమి నుండి బయటకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. విభజన హామీల కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాడాలని, అప్పుడే ప్రజలు నమ్ముతారని చంద్రబాబుకు సూచించారు. తిరుపతిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర పార్టీ తరపున స్వాగతించారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ విజయవాడలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, సేకరించిన రక్త నమూనాలను ప్రధాని మోదీ, సహా కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి పంపించి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. దాసరిభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల మూడు నెలలు గడిచినా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ప్రత్యేక హోదా సహా విభజన బిల్లులో పొందుపరచిన అంశాలను కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. ఆర్థిక లోటు భర్తీ విషయంలోనూ తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. ఏపికి రూ. 16,300 కోట్ల ఆర్థికలోటు ఉంటే రెండు విడతలుగా కేంద్రం కేవలం రూ. 3,979కోట్లు మాత్రమే ఆర్థిక సహాయాన్ని మాత్రమే చేసిందన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా వెంకయ్యనాయుడు సహా పలువురు బిజెపి నేతలు ఏ మాత్రం సిగ్గులేకుండా ఏపికి అడిగిన దానికంటే ఎక్కువే చేశామని, ప్రత్యేక హోదా అవసరం లేదంటూ ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. పవన్ తమ ప్రసంగంలో రాష్ట్రానికి చెందిన ఎంపిలు ఢిల్లీలో గట్టిగా తమ వాదనను హిందీలో వినిపించాలని, పోరాట పటిమను ప్రదర్శించాలని కోరారన్నారు. అయితే మన ఎంపిలు ప్రజానాయకులు కాదన్నారు. కార్పొరేట్ వర్గాలు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద వ్యాపారులైన వీరు రూ. 20 నుండి రూ. 50 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఎంపిలుగా గెలిచారని ఎద్దెవా చేశారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును పెట్టుబడిగా భావించి వారి వ్యాపారాలను మరింత పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ప్రజాప్రయోజనాలు పట్టడంలేదని విమర్శించారు. కాగా పవన్ వ్యాఖ్యల తర్వాత కొందరు టిడిపి, బిజెపి నేతలు మాట్లాడుతూ జనసేన ఎన్టీఏలో భాగస్వామిగా ఉందని, ఆ పార్టీతో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాటం సాగిస్తామని చెబుతున్నారని తెలిపారు. ఈ విషయమై ప్రజల్లో నెలకొని ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌పై ఉందనన్నారు. జనసేన పార్టీ ఎన్టీఏకి మిత్రపక్షం కాదని ప్రకటించాలని ఆయన డిమండ్ చేశార. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెను సంపూర్ణమైన మద్ధతును ఇస్తున్నామని తెలిపారు. ఈ సమ్మెను జయప్రదం చేసేందుకు అందరూ కృషి చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, పి హరినాథరెడ్డి, ఎమ్మెల్సీ పిజె చంద్రశేఖరరావు పాల్గొన్నారు.