విజయవాడ

దేవుడి సన్నిధిలో రాజకీయాలు తగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: విజయవాడ నగర నడిబొడ్డున డూండి గణేష్ సేవా సమితి 2015లో కోగంటి సత్యనారాయణ గౌరవ అధ్యక్షతన గత సంవత్సరం డూండీ గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించిందని, అయితే ఈ ఏడాది కొందరు రాజకీయాలు చేశారని సేవా సమితి నేతలు విమర్శించారు. ఈ ఏడాది కూడా కోగంటి సత్యం అధ్యక్షతన ఉత్సవాలు నిర్వహించాలని తలపెట్టి 72 అడుగుల విగ్రహాన్ని తయారుచేసేందుకు కోగంటి సత్యం ఐరన్‌ను, మట్టి విగ్రహాల తయారీకి గణేష్ మట్టి విగ్రహాల కమిటీ చైర్మన్ కొప్పోలు విజయకుమార్ మట్టిని అందించినట్లు గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు తెలిపారు. ఈసందర్భంగా కొప్పోలు విజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 5వేల మట్టి విగ్రహాలు తయారుచేసి భక్తులకు అందిస్తున్నామని తెలిపారు. అలాగే విగ్రహాలకు సరిపడే ఐరన్‌ను కోగంటి సత్యనారాయణ అందించేవారని, అయితే విగ్రహం తయారై పూజలు మొదలుపెట్టే సమయంలో హైదరాబాద్ నుండి వచ్చిన పారేపల్లి రాకేష్ అనే చీడపురుగు వివాదాలు సృష్టించాడని ఆరోపించారు. నగరంలో గొడవలు పెట్టి అందరికీ అందుబాటులో వుండే పారిశ్రామికవేత్త కోగంటి సత్యంపై స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, రాకేష్ కలిసి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గత సంవత్సరం వినాయక ఉత్సవాలు కోగంటి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించామన్నారు. ఈ సంవత్సరం 72 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఉత్సవాలు నిర్వహిస్తుంటే ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు దేవుడ్ని అడ్డుపెట్టుకొని రాజకీయ అస్త్రంగా మలచుకొని తన స్వార్థ రాజకీయాల కోసం కోగంటిపై అక్రమ కేసులు పెట్టించారని విమర్శించారు. గణేష్ ఉత్సవాల పేరుతో చందాలు వసూలు చేస్తున్న బోండా అనుచరులపై పోలీస్ కమిషనర్ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజయకుమార్ కోరారు. విలేఖర్ల సమావేశంలో మాజీ డెప్యూటీ మేయర్ సిరిపురపు గ్రిటన్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు త్రినాథ్ పాల్గొన్నారు.