విజయవాడ

డెంగ్యూ, మలేరియాపై అవగాహనకు ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 19: రాష్ట్రంలో ప్రజలకు డెంగ్యూ, మలేరియా వ్యాధులపై పూర్తి అవగాహన కలిగించేందుకు క్షేత్రస్థాయి ప్రచారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ఐజిఎం స్టేడియంలో రాష్ట్ర స్థాయి అర్బన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అవగాహన ప్రచార వాహనాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 242 వాహనాలు అవగాహన కల్పించే దిశగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయన్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు అవగాహన కోసం ఒక వాహనం తిరిగే దిశలో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నారు. ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిన కేసుల విషయంలో అనవసరంగా డెంగ్యూ అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని, దీనికి భయపడవద్దని తెలిపారు. డెంగ్యూ లక్షణాలతో ఉన్న రోగాలకు సరైన చికిత్స అందించనున్నామన్నారు. కృష్ణా జిల్లాలో 102 కేసులు నమోదు కాగా విజయవాడలో 26, మచిలీపట్నంలో 15 మంది వ్యక్తులను గుర్తించి చికిత్స అందించామని, అందరూ సురక్షితంగా ఉన్నారన్నారు. జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ లక్షణాలతో చేరిన రోగుల వివరాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తప్పనిసరిగా తెలియజేయాలని ఆయన స్పష్టం చేశారు. వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, నేపథ్యం, ఏఏ పరిస్థితుల్లో డెం గ్యూ దోమ వ్యాపిస్తుంది, దోమ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎవరికి ముప్పు ఎక్కువ అనే అంశంపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. డెంగ్యూతో పాటు మలేరియాపై అవగాహన కలిగిస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే 104 వాహనం ద్వారా అవగాహన చేపడుతున్నామన్నారు. డెంగ్యూ దోమ ఉదయం పూట కుడుతుందని, దాని ప్రభావం 100 మీటర్ల వరకు ఉంటుందని, మలేరియా దోమ రాత్రి సమయంలో కుడుతుందని తెలిపారు. డెంగ్యూపై అనవసర భయాందోళనలు వద్దని, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సూచనల మేరకు తగిన విధంగా మందులు వాడాలని మంత్రి కామినేని సూచించారు. కార్యక్రమంలో నగర మేయర్ కోనేరు శ్రీ్ధ ర్, ఏమ్మెల్యే గద్దె రామ్మోహన్, డిఎంహెచ్‌ఓ ఎస్ నాగమల్లేశ్వరి, డిఎంఓ ఆర్ ఆదినారాయణ, డెప్యూటీ డిఎంహెచ్‌వో శాస్ర్తీ, తదితరులు పాల్గొన్నారు.