విజయవాడ

కెఎంకె పుష్కర టెండర్ వివాదంలో వికెట్ డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 22: ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు కెఎంకె పుష్కర టెండర్ వివాదంలో విఎంసి ఉద్యోగి ఒకరు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ వివాదానికి ప్రధాన సాక్షిగా నిలిచిన కెఎంకె ఓచర్ బిల్లు నకలు కాపీ బయటకు ఎలా వచ్చిందన్న విషయంతోపాటు ఒరిజినల్ కాపీ కనిపించడం లేదన్న ఆరోపణలపై అకౌంట్స్ సెక్షన్‌లో పనిచేసే జ్ఞానప్రసాద్ అనే అధికారిని సస్పెండ్ చేస్తూ విఎంసి కమిషనర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ వెనుక గల కారణాలను పక్కన పెడితే అసలు ఈవిషయంలో సస్పెండ్‌కు గురైన అధికారికి ఎంతటి సంబంధం ఉందన్న విషయంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చెక్కుల అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓచర్ భద్రత, లీక్ వ్యవహారంపై ఆయనకు ఏమి సంబంధమంటూ కమిషనర్ వీరపాండియన్ తీసుకొన్న సస్పెండ్ నిర్ణయంపై విఎంసి ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా కృష్ణాపుష్కరాల్లో నగర మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కోనేరు శ్రీ్ధర్ భార్య రమాదేవి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కారణంగా మేయర్‌గా ఉన్న వారి కుటుంబ సభ్యులెవ్వరూ స్థానికంగా జరిగే టెండర్, వ్యాపార ప్రక్రియల్లో పాల్గొన కూడదని, అలా పాల్గొంటే మున్సిపల్ చట్టాల ప్రకారం మేయర్ అనర్హత గురవుతారన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే చట్ట ప్రకారం మేయర్ శ్రీ్ధర్‌ను అనర్హుడుగా ప్రకటించాలంటూ నగర ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల విఎంసి కమిషనర్ వీరపాండియన్‌కు రెండు సార్లు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఆమె సమర్పించిన ఆధారాల్లో అంతకుముందు కెఎంకె నిర్వహించిన వ్యాపార లావాదేవీల్లో బిల్లు పొందిన ఓచర్‌ను జత చేయడంతో అసలు ఆ ఓచర్ బిల్లు ఏ విధంగా బయటకు వచ్చిందన్న విషయంపై ప్రస్తుతం సస్పెండ్ చర్యలకు కారణమైందని చెప్పవచ్చు.
కెఎంకె పుష్కర టెండర్ వివాదంలో రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతపై కనీస చర్యలు తీసుకోలేని నగర పాలకులు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడమేమిటని వాదిస్తుండగా ఈ సస్పెండ్ చర్యలు కేవలం వివాదాన్ని పక్కదారి పట్టించడానికేనని విపక్షాలు ఆరోపిస్తుండగా ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు’ ఉద్యోగిపై సస్పెండ్ చర్యలు తీసుకోవడంపై ఇటు విపక్ష నేతలే కాకుండా విఎంసి ఉద్యోగులు కూడా నిరసన తెలుపుతున్నారు.