విజయవాడ

అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: భారీ వర్షాలు, సైక్లోన్ ప్రభావం నేపధ్యంలో జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బాబు.ఎ ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో 45వేల ఇరుగు పొరుగు బృందాలను ఏర్పాటుచేయడం ద్వారా ఆరోగ్యం, వనం-మనం, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలతో దోమలపై దండయాత్రను పూర్తిస్థాయిలో అమలుచేయడం ద్వారా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు.
స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి గురువారం మండలాధికారులతో సైక్లోన్, వరదలు, కృష్ణా జలాల విడుదల వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ గురువారం పులిచింతల ప్రాంతం నుంచి నీటి విడుదల, పొరుగు జిల్లా గుంటూరులో అత్యధిక వర్షపాతం నమోదు కావడం దృష్ట్యా లోతట్టు, నదీతీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజి నుండి 20 గేట్లు తెరవడం జరిగిందని, అత్యధిక స్థాయిలో నీటి విడుదల జరుగుతున్న దృష్ట్యా తగిన అప్రమత్తతతో వుండాలన్నారు. అదే సందర్భంలో ఆయా మండల ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే పొలాలను, పంటలను గుర్తించి నివేదికలను రూపొందించాలని సంబంధిత శాఖలతో చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూం, జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదే విధంగా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1077 టోల్‌ఫ్రీ నెంబర్‌కు, విజయవాడలోని0866-2474700/2474701 మరియు 086672-252572 నెంబరుకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. డివిజన్ స్థాయిలో కూడా బాధ్యత గల అధికారితో డివిజన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయి, గ్రామస్థాయి అధికారుల నుండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునే వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. 2.94 లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజి నుంచి 20 గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి విడుదలచేస్తున్నందున అప్రమత్తంగా వుండాలని కలెక్టర్ సూచించారు. సైక్లోన్ ప్రభావిత సమయంలో తీసుకునే చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల, ముంపు ప్రాంత ప్రజలను సైక్లోన్ సెంటర్లకు తరలించేందుకు సిద్ధంగా వుండాలన్నారు.
ఆర్‌ఎంపి ప్రైవేట్ వైద్యశాలలకు వచ్చే రోగులను ప్రభుత్వ ఆసుపత్రులకు సిఫార్స్ చేయాలని, ఈ విషయంలో జ్వరాలతో బాధపడే వ్యక్తులకు, ప్రజలకు ప్రథమ చికిత్స చేయడం ద్వారా సరైన రోగ నిర్దారణ జరగకుండా వైద్యం చేయడం ద్వారా ఎటువంటి సంఘటనలు జరుగకుండా తీసుకునే చర్యలు నేపధ్యంలో ఈ ఆదేశాలను జారీ చేయడం జరుగుతోందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జిల్లాలో వెయ్యికి పైగా ఆర్‌ఎంపి ప్రైవేట్ వైద్యశాలలు నిర్వహిస్తున్నారన్నారు. వారందరినీ జిల్లాలో పలు జ్వరాల కేసులు నమోదు అవడం, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాల తీవ్రతను పూర్తిస్థాయిలో తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేవలం సాధారణ జ్వరం అయినప్పటికి వారిని ప్రభుత్వాసుపత్రికే సిఫార్స్ చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి గంధం చంద్రుడు, జిల్లా డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.