విజయవాడ

సమరానికి సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 22: విఎంసి కౌన్సిల్ సర్వ సాధారణ సమావేశం శుక్రవారం జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ జరిగిన కౌన్సిల్ సమావేశాలతో పోల్చితే నేడు జరగబోయే కౌన్సిల్ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కృష్ణా పుష్కరాల్లో విఎంసితోపాటు విఎంసి కమిషనర్ వీరపాండియన్‌కు ఎన్నో కితాబులు రాగా నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాత్రం పుష్కర టెండర్ ప్రక్రియలో వివాదంలో చిక్కుకొని కొద్దిరోజులుగా నగర రాజకీయాల్లో వాడీ వేడి వాతావరణాన్ని సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే కాగా సిపిఎం ఫ్లోర్ లీడర్ గాదె ఆదిలక్ష్మీ 2/238 అంశానికి అనుబంధంలోని 6వ అంశంగా అడిగిన ప్రశ్నలో కృష్ణా పుష్కరాల నిర్వహణ నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విఎంసికి ఏయే కార్యక్రమాల కొరకు ఎంతెంత నిధులు జమ కాబడినవి, విఎంసి జనరల్ ఫండ్ నుంచి పుష్కరాల నిర్వహణకు ఏయే కార్యక్రమాలకు ఎంతెంత ఖర్చు చేశారన్న ప్రశ్నతోపాటు 7వ ప్రశ్నగా 2016 పుష్కరాల సందర్భంగా చేపట్టిన పనులు, విలువ, చేసిన కాంట్రాక్టర్లు, వారి సంస్థల వివరాలు తెలపాలంటూ వేసిన ప్రశ్నలు ప్రస్తుత కౌన్సిల్‌కు హైలెట్‌గా నిలిచాయి. ఇదిలావుండగా మేయర్ భార్య రమాదేవి డైరెక్టర్‌గా ఉన్న కాంట్రాక్ట్ సంస్థకు పుష్కర టెండర్ ప్రక్రియలో పాల్గొడం విఎంసి చట్టాలకు విరుద్ధమని, ఆయా చట్టాల ప్రకారం మేయర్‌ను అనర్హుడుగా ప్రకటించాలంటూ కొద్దిరోజుల క్రితం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల విఎంసి కమిషనర్ వీరపాండియన్‌కు ఆధారాలతో కూడిన ఫిర్యాదును ఒకటికి రెండు సార్లు అందజేయడం, ఆ ఫిర్యాదుపై అధికారికంగా తీసుకోవాల్సిన చర్యల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం జరగబోయే కౌన్సిల్ సమావేశంలో తన వాదనను వినిపించనున్నట్టు తెలుస్తోంది. నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు నగరంలోని బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపుల ఎన్‌ఓసి వివరాలు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్‌ల వివరాలపై అడిగిన ప్రశ్న కూడా ముఖ్యమైనదే. వీటితోపాటు కౌన్సిల్ ముందుకు వచ్చిన ప్రతిపాదిత అంశాలను పరిశీలిస్తే పటమట టీచర్స్ కాలనీలో 633.97 చ.మీల స్థలం, భవానీపురంలోని 862.86 చ.మీ స్థలం, భవానీపురంలోని 1337.4 చ.మీ స్థలం వినియోగ మార్పుపై కౌన్సిల్‌కు వచ్చిన ప్రతిపాదిత అంశాలు టౌన్ ప్లానింగ్ కు చెందిన ఈ అంశాలు, 42వ డివిజన్ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు ప్రతిపాదించిన గాంధీనగర్ కౌతా పూర్ణానంద కాంప్లెక్సుకు చెందిన పన్ను బకాయిలు, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమమహేశ్వరరావు ప్రతిపాదించిన అంశం పాయకాపురంలో సిఎన్‌జీ గ్యాస్ బంక్‌ను ఏర్పాటుకు స్థలం కేటాయించాల్సిందిగా చేసిన ప్రతిపాదిత అంశాలపై రసవత్తర చర్చ జరగనున్నది. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రధాన చర్చకు దారితీసిన ఫన్‌టైమ్స్ రోడ్డు నిమిత్తం కేటాయించిన స్థల సేకరణలో భాగంగా స్థల యజమానులకు విఎంసి అందజేసిన టిడిఆర్ బాండ్ల వ్యవహారంలో కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయంటూ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ జి మహేష్ చేసిన ప్రతిపాదనపై మేయర్ శ్రీ్ధర్ ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేయిస్తామన్న కమిషనర్ వీరపాండియన్ హామీ ఎంతవరకు కార్యరూపంలోకి వచ్చిందన్న అంశంపై విపక్షాల తోపాటు అధికార పార్టీ కార్పొరేటర్లు కూడా సభలో పట్టుపట్టే అవకాశం కనబడుతోంది. విఎంసిలో రొటేషన్ పద్ధతిలో తమకు ఉన్నత అవకాశాలు కల్పించాలన్న విషయంపై కొంత మంది టిడిపి కార్పొరేటర్లు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా మేయర్‌పై అసమ్మతి బావుటా ఎగురవేసిన కార్పొరేటర్లు నేడు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో పుష్కర టెండర్ వివాదంలో చిక్కుకొన్న మేయర్ శ్రీ్ధర్‌కు ఎంతవరకు సహకరిస్తాన్న విషయంపై ఉత్కంఠ నెలకొనగా ఈవిషయంపై టిడిపి కార్పొరేటర్లలోనే విభిన్న వాదనలు వినిపిస్తున్న వైనం గమనార్హం.