విజయవాడ

కమాండ్ కంట్రోల్ ద్వారా వీధి దీపాల నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 22: విజయవాడ నగరపాలక సంస్థలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. తొలివిడతగా వీధి దీపాల నిర్వహణను అమలులోకి తెచ్చిన నగర పాలకులు ఈ వ్యవస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి డాష్‌బోర్డునకు కూడా అనుసంధానం చేయడంతో నగర వీధి దీపాల నిర్వహణ సిఎం కార్యాలయ పరిశీలనలో ఉంటుంది. దీంతో నగర ప్రజలకు వీధి దీపాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందనే చెప్పాలి. బయోమెట్రిక్ హాజరు విధానం, ఆన్‌లైన్ ప్లాన్ అమలు, సోలార్ పవర్ వినియోగం వంటి విభాగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటూ రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలచిన విఎంసి ఇటీవల కొద్ది రోజుల క్రితం స్కాచ్ 2016 జాతీయ అవార్డును సొంతం చేసుకొన్న విఎంసి కొద్దిరోజుల్లోనే మరింత ఆధునిక సాంకేతిక వ్యవస్థతో కూడిన కమాండ్ కంట్రోల్ విధానాన్ని అనుసంధానం చేయడం మరో సాంకేతిక విప్లవమనే చెప్పాలి. నగరంలో ఉన్న 31,778 వీధి దీపాలను ఈ కంట్రోల్ వ్యవస్థ కిందకు తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా గురువారం సాయంత్రం విఎంసి కమిషనర్ వీరపాండియన్ కెనాల్‌రోడ్డు లోని వీధి దీపాల నిర్వహణను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ ద్వారా లైట్లను వెలిగించడం, ఆర్పివేయడం వంటి ప్రక్రియను వీక్షించిన ఆయన ఎక్కడైనా స్ట్రీట్ లైట్ వెలగకపోతే వచ్చే సంకేతాలేమిటి, తదుపరి అధికారులు తీసుకునే చర్యలేమిటన్న విషయంపై కూడా పరిశీలన చేశారు.
అంతేకాకుండా ఈ కంట్రోల్ వ్యవస్థను రాష్ట్ర ముఖ్యమంత్రి డాష్‌బోర్డునకు అనుసంధానం చేయడంతో ఇకనుంచి నగర వీధీ దీపాల నిర్వహణ సిఎం ఆధీనంలో కూడా ఉంటుందన్న విషయం అధికారికం. మొత్తం స్ట్రీట్‌లైట్లను 510 సిసిఎంఎస్ బాక్స్‌లకు అనుసంధానం చేశారు.