విజయవాడ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుంటే చరిత్రహీనులవుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 25: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దారుణంగా మోసం చేశారని సిపిఐ జాతీయ కార్యదర్శి డా కె నారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కావాలా? ప్యాకేజీలు కావాలా? అనే అంశంపై ప్రజాభిప్రాయం కోరేందుకు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం 7 డివిజన్ నిమ్మతోట సెంటర్‌లో ప్రజాబ్యాలెట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డా.నారాయణ ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆంధ్ర రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ప్రకటించగా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తాం, అధికారంలోకి రాబోయేది తామేనని చెప్పి వెంకయ్య నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా సన్మానాలు చేయించుకున్నారని గుర్తు చేశారు. ప్యాకేజీల విషయానికే వస్తే విభజన హామీలతోపాటు రూ. 2.25 కోట్ల ప్యాకేజీలు వీరిద్దరూ తేగలరా అని ప్రశ్నించారు. ఆ ప్యాకేజీ గనుక సాధిస్తే వారిద్దరినీ కనకదుర్గమ్మ ఎదుట పాలతో అభిషేకం చేస్తామని, లేనిపక్షంలో కృష్ణానదిలో ముంచుతామని ఘాటుగా స్పందించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ హోదా అంశాన్ని ఎన్నికల్లో ప్రచారం చేసుకుని అధికారంలోకొచ్చిన బిజెపి, టిడిపి ప్రభుత్వాలు మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు. సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రానికి హోదా కల్పిస్తే పరిశ్రమలు, ఇతరత్రా అనేక ప్రయోజనాలు, పన్ను రాయితీలు వస్తాయన్నారు. ఏపిఐఐసి కాలనీ అధ్యక్షులు పాతూరి సాంబశివరావు, ఉపాధ్యాయవాణి సంపాదకులు మూకల అప్పారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి జి కోటేశ్వరరావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు లంక దుర్గారావు, సిహెచ్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు నూతక్కి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.