విజయవాడ

అమర వీరుల సప్తాహం విజేతలకు బహుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 20: అమర వీరుల సంస్మరణ సప్తాహం సందర్భంగా నగర పోలీసు శాఖ స్కూల్ విద్యార్థులకు, పోలీసులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ నెల 21న పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన వారోత్సవాల్లో భాగంగా కమిషనరేట్‌లోని పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ, పెయింటింగ్, కార్టూన్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పోలీసు సిబ్బందికీ వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 17 మంది విద్యార్థులు, ఆరుగురు పోలీసు సిబ్బందికి ప్రతి పోటీలోనూ, ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో విజేతలుగా ప్రకటించారు. వీరికి గురువారం సాయంత్రం పోలీసు కమిషనర్ కార్యాలయంలో సిపి సవాంగ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిపి జివిజి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. విజేతలకు సర్ట్ఫికెట్లతో పాటు ప్రథమ, బహుమతిగా ఐదు వేలు, ద్వితీయ బహుమతిగా మూడు వేలు, తృతీయ బహుమతిగా రెండు వేలు చొప్పున ఇచ్చారు.