విజయవాడ

కార్పొరేటర్ చంటిపై బిగుస్తున్న ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 15: విమానయాన ప్రయాణంలో తోటి ప్రయాణికురాలిపై అసభ్యంగాను, అనుచితంగాను ప్రవర్తించాడన్న విషయంపై నేరారోపణలు ఎదుర్కొంటున్న నగర 25వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) పై ఉచ్చు బిగుస్తోంది. సదరు ప్రయాణికురాలి ఫిర్యాదును పరిగణలోకి తీసుకొన్న శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు చంటిని విచారించేందుకు గాను పోలీసులు విజయవాడ నగరానికి వచ్చి ఆయన నోటీసులిచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈవిషయంపై ఒక నిర్ణయానికి వచ్చిన శంషాబాద్ పోలీసులు నోటీసులు ఇవ్వడమే కాకుండా అవసరమైతే ఆయనను తమతో తీసుకెళ్ళేందుకు కూడా ప్రణాళికలు సిద్దం చేస్తున్న సమాచారం కాగా ఇప్పటికే ఈవిషయంపై రాజకీయ రగడ రేగిన విషయంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనున్న విషయంపై గందరగోళ పరిస్థితి నెలకొంది. దేశంలోని 7 కార్పొరేషన్ల అద్యాయనం పేరిట ఉత్తర భారత దేశ యాత్రకు వెళ్ళిన నగర కార్పొరేటర్లు తమ యాత్ర ముగించుకొని ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో తమ పక్కన కూర్చొన్న మహిళా ప్రయాణికురాలు చేసిన ఫిర్యాదు క్రమంలో గన్నవరం చేరుకోగానే విమానాశ్రయంలో సదరు కార్పొరేటర్‌ను అదుపులోకి తీసుకొని ఎయిర్ పోర్టు అధికారులు విచారించిన విషయం అందరికీ తెలిసిందే. మహిళా ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన కార్పొరేటర్ చంటిని తక్షణమే బహిష్కరించి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించాలంటూ శనివారం సాయంత్రం నగరంలోని మహిళా సంఘాలు సుధీర్ఘ సమయం పాటు అనగా సుమారు 4 గంటల పాటు విఎంసి కౌన్సిల్ భవనం వద్ద ధర్నా చేసి మేయర్ కోనేరు శ్రీ్ధర్ వాహనం వద్ద బైటాయించిన విషయంపై కలకలం రేపిన వైనం గమనార్హం కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈవిషయంపై శంషాబాద్ పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకొని ప్రయాణికురాలి ఫిర్యాదుపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ తీసుకొన్న నిర్ణయం మేరకు నిందారోపణ ఎదుర్కొంటున్న చంటిని విచారించి నేరం రుజువైతే చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దమవుతోంది. ఇదిలావుండగా విమానయానంలో కార్పొరేటర్ చంటి ఎటువంటి తప్పిదం చేయలేదని, కేవలం విపక్షాలు తమ రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారంటూ నగర మేయర్ శ్రీ్ధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, టిడిపి ఫ్లోర్ లీడర్ జి హరిబాబు తదితర కార్పొరేటర్ల మిత్ర బృందం శనివారం సాయంత్రం కౌన్సిల్ భవనంలోని టిడిపి ఛాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ చంటిపై నేరం రుజువైనా తాము తమ కార్పొరేటర్ పదవులకు రాజీమానా చేస్తామంటూ సవాల్ విసిరిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలో చంటిని విచారించేందుకు శంషాబాద్ పోలీసులు నోటీసులతో నగరానికి వస్తున్నారన్న విషయం మీడియా ప్రసారాల ద్వారా తెలుసుకొన్న టిడిపి కార్పొరేటర్ల, పెద్దలు ఒకవేళ చంటి నేరం రుజవైతే విపక్షాల విమర్శలను ఏ విధంగా ఎదుర్కొనాలన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు వినికిడి. కాగా ఈవిషయంలో ఏప్పుడు ఏం జరుగబోతోందన్న విషయంపై కార్పొరేటర్లతోపాటు నగర ప్రజలలో కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.