విజయవాడ

కనకదుర్గమ్మ సాక్షిగా... భక్తుల పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, మే 15: కనకదుర్గనగర్‌లో భక్తులకు అవసరమైన అన్ని రకాలైన వౌలిక సదుపాయాల కల్పనలో దుర్గగుడి అధికారులు ఘోరంగా విఫలం చెందినట్లు ఇక్కడ ఉన్న అరకొర వసతులే స్పష్టం చేస్తున్నాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా దుర్గఘాట్ మొత్తం కూల్చేస్తారు. ప్రస్తుతం కనకదుర్గనగర్‌లోనే భక్తులు తలనీలాలు సమర్పణ, స్నానాలు, వాహానాల పార్కింగ్, తదితర వాటిని దుర్గగుడి అధికారులు ఏర్పాటు చేసారు. భక్తులు తలానీలు సమర్పించుకోవటానికి చేసిన కేశఖండనశాఖ అధిక సంఖ్యలోవచ్చే భక్తుల అవసరాలు తీర్చలేక పోతోందన్న విమర్శనలు వినబడుతున్నాయి. మొక్కుబడుల నిమిత్తం భక్తులు తలనీలాలు సమర్పించుకున్న తర్వాత స్నానాలు చేసేందుకు కూడ వారికి ఈప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లలను దుర్గగుడి అధికారులు చేయలేదు. స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకోనే భక్తులు, తలనీలాలు సమర్పించుకున్న భక్తులు అందరు కలిసి ఒకచోట స్నానాలు చేయవల్సిన పరిస్ధితులు కనకదుర్గనగర్‌లోనెలకున్నాయి. ఆదివారం, శుక్రవారం, రోజుల్లో వచ్చే భక్తులకు కనకదుర్గనగర్‌లో ఏర్పాటు చేసిన వసతులు ఏమాత్రం సరిపోవటంలేదన్నారు. ఆదివారం ఉదయం తలనీలాలలు సమర్పించుకోవటానికి భక్తులకు సుమారు 3గంటల సమయం పట్టింది. ఇదే విధంగా స్నానాలు చేసేందుకు కూడ భక్తులకు ఇంతే సమయం పట్టటంతో భక్తులకు విలువైన కాలం వృధ అవుతోందని భక్తుల నుండి తీవ్రస్ధాయిలో విమర్శనలు వినబడుతున్నాయి. నిత్యం అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్యకు ఇక్కడ వసతులు ఏమాత్రం చాలటం లేదని పలుసార్లు దుర్గగుడి అధికారులకు భక్తులకు విజ్ఞప్తి చేసినప్పటికీ చర్యలు తీసుకోవటంలేదన్న విమర్శనలు వినబడుతున్నాయి. కనకదుర్గనగర్‌లో అరకొర వసతులపై పలువురు భక్తులు ఆదివారం ఉదయం తీవ్రస్ధాయిలో అక్కడ సిబ్బందిపై తీవ్రస్ధాయిలో వాదనకు దిగ్గారు. దీంతో అక్కడ దుర్గగుడి సిబ్బంది ఈవిషయాన్ని ఉన్నతస్ధాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం జరుగుతోందని చెప్పటంతో భక్తులు కొంతమేరకు శాంతించారు. ఈవిషయంపై దుర్గగుడి ఇన్‌చార్జ్ ఇవో యస్‌యస్ చంద్రశేఖర్ అజాద్ మాట్లాడుతూ కనకదుర్గనగర్‌లోని వసతులు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు సరిపోవటంలేదని ఈవిషయాన్ని పరిశీలించి శ్రీ అరండల్ సత్రాన్ని బాగు చేయించి శాశ్వత కేశఖండనశాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కనకదుర్గనగర్‌లో భక్తులకు అవసరమైన అన్ని రకాలైన వౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయటం జరుగుతోందన్నారు. ఘాట్‌రోడ్ వాహానాల సంఖ్య తక్కువుగా ఉంటే కార్లను కొండపైకి అనుమతించటం జరుగుతోందన్నారు. ప్రత్యేకంగా ఆదివారం,శుక్రవారం భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందన్నారు.