విజయవాడ

ప్రశాంతంగా టిఎస్ ఎంసెట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, మే 15: తెలంగాణా రాష్ట్రంలోని మెడికల్, ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి నిర్వహించి తెలంగాణా రాష్ట్ర ఎంసెట్ పరీక్ష నగరంలో ప్రశాంత వాతావణంలో నిర్వహించారు. నీట్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ పరీక్షను ఆదివారం నగరంలోని పలు సెంటర్లలో అధికారులు పగ్భందీ ఏర్పట్లు ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. అయితే ఇప్పటికే పలు సందర్భాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు పరీక్షకు ఒక్క నిముషం అలస్యమైన అనుమతించమన్న ఖచ్చితంగా అమలు చేసారు. దీని కారణంగా పలువురు విద్యార్థులు పరీక్షను వ్రాయకుండా వెనుదిరిగారు. అయితే తెలంగణా రాష్ట్రంలో ఆంధ్ర విద్యార్థులకు అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉండటంతో ఆంధ్రా విద్యార్థులు పెద్ద అశక్తిని కనబరచలేదు. ఇక నగరానికి సంబంధించి పలు ప్రాంతాల్లో నిర్వహించిన పరీక్షా కేంద్రాల్లో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసారు. ముఖ్యంగా ఎండలు ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అటంకాలు కలుగకుండా ఏర్పాట్లు చేసారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన టెంట్లను ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటిని కూడా అందుబాటులో ఉంచారు. ఇంజనీరింగ్ పరీక్షను ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు నిర్వహించారు. అలాగే మెడికల్, అగ్రీకల్చర్‌కు సంబంధించిన పరీక్షను రెండు గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించారు. ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించి సుమారు 10 వేల మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6వేల మంది విద్యార్థులు మాత్రమే హాజరైయ్యారు. మెడికల్ పరీక్షకు సంబంధించి ఇదే హాజరు కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు ప్రాంతాల్లో నిర్వహించి ఈ పరీక్షల్లో విజయవాడలోనే అతి తక్కువ హాజరు నమోదు కావడం విశేషం. ఈ పరీక్షకు సంబంధించి సీట్ల లభ్యత తక్కువుగా ఉండటంతో పాటు నీట్‌ను ఈ ఎడాది నుంచే అమలు చేయాలని సుప్రీం కోర్టు స్పషం చేయడంతో విద్యార్థుల నుండి అశక్తి తక్కువుగా ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఒక్కనిముషంతో విద్యాసంవత్సరం వృధా
నగరంలో నిర్వహించిన టిఎస్ సెట్‌కు సంబంధించి ఒక్క నిముషం అలస్యంతో పలు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేక పోయారు. రెండు సంవత్సరాల ఇంటర్ తరువాత కష్టపడి చదివి చివరి నిముషంలో పరీక్షకు హాజరు కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర నిరాశ చెందారు. పరీక్షకు సంబంధించి నిబంధనలను ఖచ్చితంగా అధికారులు అమలు చేయడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో సుమారు 50 మందికి పైగా విద్యార్థులు ఒక్క నిముషం అలస్యంతో ఒక సంవత్సరం విద్యాసంవత్సరాన్ని కోల్పోవల్సి వచ్చింది. కనీసం 15నిముషాల సమయం ఇచ్చినట్లైతే బాగున్న అన్న సూచనలు ఇటు ఉపాధ్యాయు నుండి అటు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వ్యక్తమైయింది. అయితే అధికారులు మాత్రం ఎప్పటి నుంచో విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించామంటున్నారు.