విజయవాడ

అవును... మేం కావలికుక్కలమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: రెండేళ్లుగా నగర పాలన సాగిస్తున్న తెలుగుదేశం మేయరు, కార్పొరేటర్ల అవినీతిని ఎండగట్టటంలో కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌లను ఎండగట్టటంలో భూదందాలను, కబ్జాలను వెలికితీయటంలో కమ్యూనిస్టులు కావలి కుక్కల మాదిరిగానే వ్యవహరిస్తున్నారని సిపిఐ సిపిఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, డి.కాశీనాథ్ స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయం, దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ మదమెక్కి మహిళల పట్ల కీచకుల్లా వ్యవహరిస్తున్న కార్పొరేటర్లను వెనకేసుకురావటానికి నగర మేయర్‌కు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. విహార యాత్రకు వెళ్లి తప్పతాగిన మైకంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి పూణే రైల్వే పోలీసులతో దేహశుద్ధి చేయించుకున్న కార్పొరేటర్లను తిరుగు ప్రయాణంలో విమానంలో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన కార్పొరేటర్‌ను కౌన్సిల్ నుండి బహిష్కరించాల్సింది పోయి వారి చర్యలను సమర్థించటం మేయర్ స్థాయికి తగదని విమర్శించారు. విజయవాడ నగర పరువు, ప్రతిష్ఠలను గంగపాలు చేసిన కార్పొరేటర్ల తీరుకు నైతిక బాధ్యత వహిస్తూ మేయర్ రాజీనామా చేసి నగర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విహార యాత్ర బృందానికి నాయకత్వం వహించిన డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు గురివింద సామెతను మరచి నిసిగ్గుగా ప్రెస్‌మీట్ పెట్టి తమ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయాసలో భాగంగా సిపిఐ సిపిఎం నగర కార్యదర్శులపై అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని, తెలుగుదేశం నగర పాలకులు నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్మికుల వద్ద వామపక్ష కార్మిక సంఘాలు డబ్బులు వసూళ్లు చేస్తున్నాయని, వామపక్ష నేతలను కుక్కలతో పోల్చిన టిడిపి ఫ్లోర్ లీడర్ హరిబాబుది మనిషి జనే్మనా? శవాల మీద పైసలు ఏరుకునే చరిత్ర ఆయనది కాదా అని ప్రశ్నించారు. టిడిపి మేయర్లు, కార్పొరేటర్ల అవినీతిపై సిఐడి విచారణకు సిద్ధమా? టిడిపి కార్పొరేటర్ల అవినీతి, కీచక పర్వాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. హరిబాబుకు కార్మిక సంఘాల గురించి ఏమి తెలుసని ఆరోపణలు చేస్తున్నాడని, సంఘ కార్యకలాపాలు నిర్వహించుకోవటానికి కార్మికుల వద్ద నుండి సభ్యత్వం వసూలు చేసే హక్కు కార్మిక సంఘాలకు జన్మతః ఉందన్నారు. కార్మిక సంఘాన్ని పెట్టి నిండా మూణ్ణాళ్లు గడవక ముందే బొడ్డూడని బుడ్డోడిలా వామపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఆ బురదలో తనే కూరుకుపోతాడని హెచ్చరించారు. అనేక మున్సిపాలిటీలకు, కార్పొరేషన్‌లకు ఆదర్శప్రాయంగా నిలిచిన విజయవాడ నగర కార్పొరేషన్ చరిత్రను మంటకలిపిన టిడిపి కార్పొరేటర్లను తక్షణం కౌనె్సల్ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు నగర ప్రజలకు అండగా నిలిచి చారిత్రక నేపథ్యం కలిగిన విజయవాడ నగరాన్ని కాపాడుకోవడానికి టిడిపి కార్పొరేటర్ల అవినీతిని ఎండగట్టడానికి కావలి కుక్కల పాత్ర పోషిస్తామని పునరుద్ఘాటించారు. ఈ విలేఖర్ల సమావేశంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా సూర్యారావు, సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు మాదల వెంకటేశ్వరరావు, డి.విష్ణువర్థన్ పాల్గొన్నారు.