విజయవాడ

లిట్టర్ ఫ్రీ జోన్లలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 15: నగరంలో ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న లిట్టర్ ఫ్రీ జోన్ల ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మరింత కట్టుదిట్టం చేశారు. ఇంతకుముందు జివిబి సంస్థ ద్వారా ఆయా ప్రాంతాల్లో 24 గంటల పాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన అధికారులు ప్రస్తుతం ఆ సంస్థ కాంట్రాక్ట్ ముగియడమే కాకుండా వారి చర్యలపై సంతృప్తి చెందని అధికారులు కాంట్రాక్ట్‌ను అమలును రద్దు చేశారు. దీంతో విఎంసి ప్రజారోగ్యశాఖకు చెందిన పారిశుద్ధ్య కార్మికులతోనే లిట్టర్ ఫ్రీ జోన్లలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ చేపట్టిన విఎంసి అధికారులు ప్రస్తుతం ఆయా పనులను మరింత విస్తృత పర్చి నూరుశాతం లిట్టర్ ఫీ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా లిట్టర్ ఫ్రీ రోడ్లుగా ప్రకటించిన వాటిలో రోజుకు నాలుగు సార్లు సిబ్బందితో చెత్త సేకరణకు శ్రీకారం చుట్టడమే కాకుండా అత్యవసర సమయాల్లో కేవలం ఒక ఎస్‌ఎంఎస్ లేదా ఫోన్ కాల్ ద్వారా చెత్తను తీసుకెళ్లే ప్రక్రియను అమలులోకి తీసుకువచ్చారు. ప్రతిషాపు నిర్వాహుకుడు తమకు చెందిన చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రోడ్లపైనే కాకుండా రోడ్డు మార్జిన్ స్థలాలు, కాల్వలు, ఫుట్‌పాత్‌లపై వేస్తున్న చర్యలను నియంత్రించేందుకు చేపట్టిన ప్రస్తుత చర్యలను అతిక్రమించిన వారిపై ప్రజారోగ్య చట్టాల ద్వారా అపరాధ రుసుము విధించడమే కాకుండా కఠిన చర్యలను తీసుకోబడునని విఎంసి అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన స్టిక్కర్లను ప్రతిషాపునకు అంటించే చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా విఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపినాయక్ మాట్లాడుతూ నగరంలోని అనేక రోడ్లను లిట్టర్ ఫ్రీ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు కమిషనర్ వీరపాండియన్ అదేశాల మేరకు పలు చర్యలు తీసుకొంటున్నట్టు వివరించారు. హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ అధికార, సిబ్బందితోనే కాకుండా ఎన్‌సిసి విద్యార్థుల సహకారంతో ర్యాలీలను నిర్వహించి మరింత అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. లిట్టర్ ఫీ జోన్లలో ఉన్న బస్టాప్‌లు, రోడ్డు ముఖ్య కూడళ్లలో ఆకర్షణీయమైన డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసి రోడ్లపై చెత్త వేయకుండా నిరోధిస్తున్నామన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు లిట్టర్ ఫ్రీ అమలుకు విఘాతం కల్పిస్తున్న వ్యాపారులను గుర్తించి వారి వద్ద నుంచి లక్ష రూపాయలను అపరాధ రుసుముగా వసూలు చేశామన్నారు. ఫైన్ విధించిన తరువాత కూడా అదే తప్పు చేస్తే వ్యాపారి ట్రేడ్ లైసెన్స్‌ను రద్దు చేయడమే కాకుండా షాపులను కూడా సీజ్ చేయడానికి సైతం వెనుకాడమని ఆయన హెచ్చరించిన ఆయన లిట్టర్ ఫ్రీ అమలుకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.