విజయవాడ

జక్కంపూడి కాలనీ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: జక్కంపూడిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆదివారం సాయంత్రం పౌర సంక్షేమ సంఘం, ఐద్వా కమిటీల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. జక్కంపూడిలోని హైస్కూల్ వద్ద గల గ్రౌండ్ వద్ద జరిగిన ఈ ధర్నాకి మద్దతు తెలుపుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడారు. నగరంలోని పలు చోట్ల ఉన్న పేదల ఇళ్లను బలవంతంగా కూల్చి ఇక్కడ పడేశారన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఇళ్ళు కూల్చడంపై శ్రద్ధ కాలనీలో సౌకర్యాలు కల్పించడంపై లేదని విమర్శించారు. పనులు కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలనీకి వచ్చిన తరువాత కష్టాలే తప్ప సుఖం లేదని, నీళ్ళు లేవు, డ్రైనేజీ అస్తవ్యస్తం. చెత్త తీసుకెళ్ళే నాధుడే లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జక్కంపూడిలో మూడు బార్ షాపులకు అనుమతిచ్చిన ప్రభుత్వం రేషన్‌షాపులు పెట్టేందుకు శ్రద్ధ చూపడం లేదన్నారు. ప్రభుత్వం పేదలను మనుష్యులుగా చూడటంలేదని, అందుకే మనందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. నగర ప్రధాన కార్యదర్శి కె శ్రీదేవి మాట్లాడుతూ అన్ని బ్లాకుల్లో మంచినీరు సరిపడా రాకపోవడంతో మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. బోరింగ్ పంపులు వేయాలని డిమాండ్ చేశారు. రిపేర్లున్న వాటిని బాగు చేయాలని, వీధి దీపాలు వేయాలని ఆమె కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలు పెట్టాలని, మహిళలు, యువకులకు తోడ్పాటు అందించాలని కోరారు. ఆసుపత్రి వెంటనే ప్రారంభించి, 24 గంటలు పని చేసే విధంగా డాక్టర్లు, సిబ్బంది ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సంక్షేమసంఘం నాయకులు డి విష్ణు, పి సాంబిరెడ్డి, బి రమణ, ఐద్వా నగర అధ్యక్షులు కె సరోజ, స్థానిక నాయకులు ఎల్ మోహన్, టి శ్రీను, సుభానీ, పాలవల్లి తదితరులు పాల్గొన్నారు.