విజయవాడ

బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి సరళీకృత విధానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: ఉపాధి అవకాశాల విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికిగాను సరళీకృత విధానాలను అమలు చేస్తున్నామని స్థానిక మురళీఫార్చ్యున్ హోటల్‌లో మంగళవారం దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (డిఐసిసిఐ) సమన్వయ కర్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి రావెల కిషోర్ కిషోర్‌బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి రావెల మాట్లాడుతూ పాత పోకడలకు స్వస్తిపలికి వాస్తవ దృక్పథంతో మన వ్యవహారశైలిని మార్చుకోవలసిన ఆవశ్యకత ఏర్పడుతోందన్నారు. నిశ్శబ్ద మానసిక పారిశ్రామిక విప్లవానికి నాంది ప్రస్తావంగా నూతన ఒరవడికి కేంద్ర బిందువుగా ఈ సమావేశం నిలవాలని, ఫలితాలను సాధించాలని ఆయన పేర్కొన్నారు. ప్రపంచీకరణలో భాగంగా అంతర్జాల వ్యవస్థ నేడు కుగ్రామంగా మారిందని అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఈనాడు అందుబాటులోకి వచ్చిందన్నారు. గతంలో యాజమాన్య వ్యవస్థ ఉండేదని, ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక్క వ్యక్తి చేతుల మీదే ఉండేదన్నారు. తదుపరి సమయంలో పారిశ్రామిక రెవెల్యూషన్ వచ్చి శ్రామిక వ్యవస్థ ఏర్పడిందన్నారు. శ్రామిక దోపిడీ నేపథ్యంలో తదుపరి క్రమంలో సేవా రంగానికి తిరిగి గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఐటి పరిశ్రమకు గల ప్రాముఖ్యాన్ని గుర్తించి ఆ దిశగా చర్య తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో భవిష్యత్తును అంచనా వేసి అందుకనుగుణంగా ఐటెక్‌సిటి రూపకల్పన చేసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. 1991లో ప్రధాన మంత్రి పివి నరసింహరావు నూతన ఆర్థిక విధానాలను తీసుకువచ్చాయని ఆనాడు ముఖ్యమంత్రి ఐటి పరిశ్రమలను అందుకనుగుణంగా ప్రోత్సహించడం జరిగిందన్నారు. నైపుణ్యాభివృద్ధిలో నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించడం పెద్ద సమస్యగా ఉండేదని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో అందుకు తగిన విధంగా శిక్షణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకోవాల్సి ఉంటుందని రావెల కిషోర్‌బాబు తెలిపారు. గతంలో దేశ జిడిపి వృద్ధి రేటు 72 శాతం కేవలం వ్యవసాయం రంగంపైనే ఆధారపడి ఉండేదన్నారు. తదుపరి క్రమంలో వ్యవసాయ ఉత్పాదన వృద్ధి రేటు పెరుగుతునే వున్న సేవా రంగం తన వాటాగా వృద్ధి రేటులో గణనీయమైన ప్రగతిని సాధించగలిగిందన్నారు. ఈ సమావేశంలో సౌత్ ఇండియా డిఐసిసిఐ చైర్మన్ నర్రా రవికుమార్, ఎపిఎస్‌సి లిమిటెడ్ జనరల్ మేనేజర్ కాలెబ్, ఎస్‌ఇ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసె దేవానంద్, నాబార్డు ఎజిఎం పి విజయ్, డిఐసిసి ప్రతినిధి మధుసూధన్, దళిత శ్రీ శక్తి అధ్యక్షురాలు గడ్డం ఝాన్సీరాణి, మాజీ శాసనసభ్యులు నల్లగట్ల స్వామిదాసు పాల్గొన్నారు.