విజయవాడ

రెండు నెలల్లో జెట్టీ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, నవంబర్ 22: ఇబ్రహీంపట్నం మండలం, తుమ్మలపాలెం రేవు వద్ద రూ.20 లక్షలతో నిర్మించ తలపెట్టిన జెట్టీ నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మంత్రి తుమ్మలపల్లి రేవు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.20 లక్షలతో జెట్టీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి అవసరమైన నిధులు విడుదల చేశామన్నారు. జెట్టీని 11 లక్షల క్యూసెక్కుల వరద నీటి సామర్థ్యం తట్టుకునే విధంగా నిర్మాణం చేపట్టాలన్నారు. గ్రామంలో మహిళ, మత్స్యకార సంఘాలకు లక్ష రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఆరు నెలల అనుభవం ఉన్న గ్రూపులకు రూ.50 వేల సబ్సిడీతో లక్ష రూపాయలు మంజూరు చేస్తామన్నారు. మిగిలిన మహిళా సభ్యులు కూడా గ్రూపులుగా ఏర్పడి ప్రభుత్వం అందించే సహకారాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గతంలో మత్యశాఖకు 17 కోట్ల రూపాయలు బడ్జెట్ మాత్రమే ఉండేదని, రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం దృష్ట్యా 400 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. దేశంలో మత్స్య సంపద విదేశీ మారకం విలువ 36 వేల కోట్ల రూపాయలుండగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా 20 వేల కోట్ల రూపాయల మత్స్య వ్యాపారం జరుగుతుందన్నారు. మత్స్యకారుల మహిళలకు పచ్చళ్ల తయారీ, రంగు చేపల తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సమగ్రాభివృద్ధిలో భాగంగా ఎస్సీ కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా జి.కొండూరు మండలం, చిన నందిగామ గ్రామంలో 90 శాతం సబ్సిడీతో 20 యూనిట్లకు మోపెడ్లతో కూడిన ఐస్ బాక్స్‌లు ఒక్కొక్కటి రూ.41,500 విలువైన వాహనాలను పంపిణీ చేశారు. అదేవిధంగా 3 లక్షల 81 వేల విలువైన టాటా ఎస్ వాహనాన్ని లబ్ధిదారునికి అందజేశారు. లక్ష రూపాయల విలువైన వలలు మంత్రి ఈ సందర్భంగా పంపిణీ చేశారు.
ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా తుమ్మలపాలెం రేవు వద్ద మంత్రి 30 వేల చేప పిల్లలను కృష్ణా జలాల్లో విడుదల చేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ డిడి బలరాం, ఎడి జయరావులతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.