విజయవాడ

నగరంలో ‘బాహుబలి-2’ హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 22: నగరంలో ‘బాహుబలి’ హల్‌చల్ చేశాడు. ప్రముఖ దర్శకుడు రాజవౌళి దర్శకత్వంలో రూపొందుతున్న బాహుబలి రెండో విభాగం దృశ్యాలు బయటకు పొక్కడం నగరంలో సంచలనం రేకెత్తించింది. చిత్రంలోని క్లైమాక్స్ దృశ్యాలకు గ్రాఫిక్స్ జోడిస్తున్న క్లిప్పింగ్‌లు హైదరాబాద్ అన్నపూర్ణ స్డూడియో నుంచి చోరీకి గురైనట్లు వెలుగులోకి రావడం చిత్రసీమ వర్గాలతోపాటు నగర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కాగా కొన్ని పోరాట సన్నివేశాలను ‘హైజాక్’ చేసిన వ్యక్తి నగరంలోని తన స్నేహితులు పలువురికి షేర్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంతో ఉత్కంఠ రేగింది. దృశ్యాలు చోరీకి గురైనట్లు చిత్ర నిర్మాతల ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని సైబర్ సెల్ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని విజయవాడలో గుర్తించినట్లు సమాచారం. దీంతో ప్రత్యేక బృందాలు నగరానికి చేరుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించినట్లు వినికిడి. కోట్ల రూపాయల బడ్జెట్‌తో బాహుబలి - 2 నిర్మాణం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తొలి భాగంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అనే సస్పెన్స్ అలాగే జనం మదిలో ఉండిపోయింది. రెండో విభాగంలో ఇందుకు సమాధానం దొరుకుతుందనే ఆసక్తితో ప్రేక్షకులు నిరీక్షిస్తున్న తరుణంలో బాహుబలి-2 శరవేగంతో నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. క్లైమాక్స్ దృశ్యాలు చిత్రీకరణ జరుపుకోగా వీటికి సంబంధించి ‘గ్రాఫిక్ ఎఫెక్ట్స్’ ప్రక్రియ జరుగుతోంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుండగా అక్కడ పనిచేసే కృష్ణ అనే టెక్నీషీయన్ తొమ్మిది నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను తస్కరించి నగరంలోని తన స్నేహితులకు షేర్ చేసినట్లు తెలిసింది. స్టూడియోలో గ్రాఫిక్స్ వర్క్ జరిగే సమయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. అక్కడ పనిచేసే వారు సైతం లోపలికి వెళ్లి, వచ్చే సమయాల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తారని, కనీసం సెల్‌ఫోన్ సైతం అనుమతించరని చెబుతారు. అయినా కృష్ణ అనే టెక్నీషియన్ సన్నివేశాలను అపహరించిన సంగతి తెలియగానే చిత్ర నిర్మాతలు హైదరాబాద్‌లోని సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఓ బృందం రంగంలోకి దిగింది. దర్యాప్తులో నిందితుడు కృష్ణను గుర్తించారు. ఇతను విజయవాడలోని తన స్నేహితులకు దృశ్యాలను షేర్ చేసినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో కృష్ణ నగరంలో ఉన్నట్లు తెలుసుకుని మంగళవారం నగరానికి వచ్చిన ఓ ప్రత్యేక బృందం అతన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు లీకైన్ దృశ్యాలు కొన్ని నగరంలోని వాట్సప్‌లో హల్‌చల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనక నిజమై సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడితే నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని సినీ పరిశీలకుల అంచనా.