విజయవాడ

మా ‘చంటి’ మంచోడే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 17: 25వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) మంచివాడన్న విషయం నగర ప్రజలందరికీ తెలిసిందేనని, విమాన ప్రయాణికురాలు చంటిపై చేసిన ఫిర్యాదు శోచనీయమంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు మరో కొత్త వాదనను తెర మీదకు తీసుకువచ్చారు. ఈ సందర్బంగా మంగళవారం నగరంలోని కేశినేని భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో 51వ డివిజన్ కార్పొరేటర్ కాటిబోయిన దుర్గ్భావాని, నగర టిడిపి అర్బన్ ప్రధాన కార్యదర్శి గనే్న వెంకటనారాయణ ప్రసాద్ మాట్లాడుతూ ఫిర్యాదు చేసిన ఆవిడ మహిళ కాదని, పురుషులను ద్వేషించే ‘గే’ అంటూ సోషల్ మీడియాలోని తన బ్లాగ్‌లో పేర్కొన్న వైనాన్ని పరిశీలిస్తే తన మానసిక స్థితి కూడా సరిగా లేదన్న విషయం స్పష్టమవుతోందన్నారు. కార్పొరేటర్ చంటిపై చేసిన ఫిర్యాదు నేపథ్యంలో నమోదు చేసిన కేసు చట్ట ప్రకారం వర్తించదని ప్రకటించారు. ఫిర్యాదురాలి పేరు రితూ వాసు ప్రిమలానిగా పేర్కొన్న వారు తనకు పురుష గాలి, నీడ తగిలినా సహించని గుణం కనబడుతున్న వైనం గమానార్హం, కాగా ఫిర్యాదురాలి స్థితిని గమనించకుండా కార్పొరేటర్ చంటిపైనే కాకుండా నగర తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లపైనా వామపక్ష నాయకులు చేస్తున్న రాద్ధాంతం రాజకీయంగానే పరిగణించాలే కానీ మహిళా సమస్యగా గుర్తించరాదన్నారు. అధ్యయన యాత్రలో 16 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారని, ఈ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ మహిళలంటే తమకు ఎంతో గౌరవమని, మహిళల పట్ల మర్యాదగా వ్యవహరించే తమపై వామపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్న వైఖరి శోచనీయమన్నారు. నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు మాట్లాడుతూ నగరంలోని కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకుని సోదరుడు ముంబయిలో బాలికను విక్రయించిన విషయాన్ని గుర్తు చేస్తూ రాజకీయ లబ్ధికోసమే వారు చంటిపై దుమారం రేపుతున్నారన్నారు. సింగ్‌నగర్‌లోని సిపిఐకి చెందిన కార్యాలయానికి 10 ఏళ్ళుగా పన్ను చెల్లించకుండా మీనమేషాలు లెక్కిస్తున్న వారు నగరాభివృద్ధిపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ బుగత ఉమామహేశ్వరి, కో అప్షన్ సభ్యురాలు కె దేవమణి, దళితరత్న పరిశపోగు రాజేష్, టిడిపి మహిళా అధ్యక్షురాలు కోడెల సూర్యాలత, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు జివి నరసింహరావు పాల్గొన్నారు.