విజయవాడ

అప్రమత్తం చేసింది చంద్రబాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: రాష్ట్రంలో హెచ్‌ఐవి ఎయిడ్స్ గురించి మొదటిగా ప్రస్తావించింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. 20 సంవత్సరాల క్రితమే హెచ్‌ఐవి ఎయిడ్స్‌పై దృష్టి పెట్టడం జరిగిందని, అందులో భాగంగా ప్రజల్లో అవగాహన కలిగేలా, వివిధ కార్యక్రమాలురూపొందించడం జరిగిందన్నారు. హెచ్‌ఐవి ఎయిడ్స్‌పై సమాజంలో వున్న సైలెన్స్‌ని బ్రేక్ చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని తెలిపారు. ఇప్పటికే ఈ మహమ్మారిని 50 శాతానికి తగ్గించగలిగామని, ఇప్పటికి ఇండియాలో 21 లక్షల మంది ఈ వ్యాధి బారినపడ్డారని, ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం మంది ఉన్నారని తెలిపారు. ఈ వ్యాధి ఎక్కువగా లైంగిక సంపర్కం ద్వారా, రక్తమార్పిడి, డిస్పోజబుల్ సిరంజ్‌లు వాడకపోవడం వల్ల వ్యాధి సోకుతుందని చెప్పారు. రాష్ట్రంలో బ్లడ్ యాప్ అభివృద్ధి చేయడం జరిగిందని, దీన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. గుర్తింపు పొందిన ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల ద్వారానే రక్తాన్ని తీసుకోవాలని చెప్పారు.
ఎయిడ్స్ గురించి మాట్లాడాలంటే సమాజంలో సోషల్ స్టిగ్‌మా ఉందని, దాన్ని అధిగమించి మందులు వాడుకోవడం వల్ల దీన్నుంచి బయటపడవచ్చని చెప్పారు. ఎన్‌జివోస్, ఎయిడ్స్ నిర్మూలనలో కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్ అడల్ట్రేషన్ తగ్గించామని, ఫుడ్ అడల్ట్రేషన్ కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో 28 శాతం ఓపిని పెంచగలిగామని, 70-90 శాతం డెలివరీలు ప్రభుత్వాసుపత్రుల్లో పెంచామని, కోటీ 33వేల మందికి ఎన్‌టిఆర్ వైద్య పరీక్షల ద్వారా టెస్టులు నిర్వహించామని చెప్పారు. ప్రతి జిల్లాలో డయాలసిస్ సెంటర్లు పెట్టామని, గతంలో ఐఆర్‌ఆర్, ఎంఆర్‌ఆర్ వల్ల మరణాలు ఎక్కువగా ఉండేవని, రియల్‌టైమ్ మోనటరింగ్ వల్ల వాటిని ఇప్పుడు అదుపులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ అయిన మహిళలకు తగిన సౌకర్యాలు కల్పించి చిన్నారుల కోసం బేబి కిట్స్ ఇస్తున్నామని, తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్ ద్వారా వారిని ఇంటికి క్షేమంగా చేరుస్తున్నామని తెలిపారు.
కృష్ణాజిల్లా జెడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ మంచి ఆహారపు అలవాట్లు, మంచి ఆరోగ్య సూత్రాలు అలవాటు చేసుకోవాలని తెలిపారు. భారతదేశంలో పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వున్నారని, వారికి బలవర్ధకమైన ఆహారం అందించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని చిన్నప్పటి నుంచే విద్యార్థులు అలవాటు చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ హెచ్‌ఐవి ఎయిడ్స్ నియంత్రణకు నేడు అధునాతనమైన మందులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం కూడా ఈ వ్యాధిపై ప్రజలకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. పెద్దలు చేసిన పొరపాట్లకు పిల్లలు బాధ్యులవుతున్నారన్నారు. ప్రముఖ సంఘ సేవకులు డా.జి.సమరం మాట్లాడుతూ హెచ్‌ఐవి నిర్మూలనకు ప్రజలందరూ చేయూతనివ్వాలని, 2016 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి హెచ్‌ఐవి ఎయిడ్స్ నిర్మూలనకు హాండ్స్ ఆప్ ఫర్ హెచ్‌ఐవి ప్రివెన్‌షన్ అనే నినాదం ఇచ్చిందని తెలిపారు. ప్రపంచంలో 3.60 లక్షల మంది ఎయిడ్స్ బారినపడ్డారని, ఇండియాలో 21 లక్షల మంది వున్నారని, లక్షా 50వేల మంది పిల్లలకు ఎయిడ్స్ సోకిందని చెప్పారు. వైద్యశాస్త్రం బహుముఖంగా విస్తరించడం వల్ల తల్లి నుంచి బిడ్డలకు హెచ్‌ఐవి ఎయిడ్స్ సోకే ప్రమాదం రాదని తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మందికి ఎయిడ్స్ సోకుతుందని, 2020 నాటికి 5 లక్షల మందికి దీన్ని పరిమితం చేయాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యం నిర్దేశించినట్లు చెప్పారు. హెచ్‌ఐవి ఎయిడ్స్ వున్నవారు పూర్తిగా మందులు వాడితే ఆరోగ్యంగా వుంటారని, ఈ వ్యాధి బిపి, షుగర్ లాంటిదేనని చెప్పారు. ఇది మెడికల్‌లి మ్యానేజ్‌డ్ క్రోనిక్ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఐఎఎస్ మాట్లాడుతూ ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం ఎయిడ్స్ గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి చేపట్టడం జరిగిందన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ వున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా వుందని, హెచ్‌ఐవి ఎయిడ్స్ మందులు వాడుకోవడం ద్వారా నయం చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న వందల ఆర్ట్ సెంటర్ల ద్వారా మందులు అందిస్తున్నామని, ప్రభుత్వ ఆధ్వర్యంలో 1542 టెస్టింగ్ సెంటర్లతో పాటు పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్‌లో 179 సెంటర్లు వున్నాయన్నారు.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. మాజీ ఎంపి చెన్నుపాటి విద్యతో పాటు విజయవాడ నగర డెప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ, మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ దుర్గాప్రసాద్, మెడికల్ అండ్ హెల్త్ డైరక్టర్ అరుణకుమారి, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.