విజయవాడ

కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 1: జిల్లాలో రైతులకు ఎరువులు, క్రిమిసంహారక మందులు సకాలంలో పంపిణీ చేయటానికి మొబైల్ బేసిడ్ ఫెర్టిలైజర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లా వ్యవసాయశాఖ ఎరువుల కంపెనీల యాజమాన్యం మరియు డీలర్లతో ఎరువుల పంపిణీ వ్యవస్థలో చేపట్టిన మార్పులపై అవగాహన సదస్సునుజిల్లా కలెక్టర్ బాబు.ఎ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యావసర సరుకుల పంపిణీలో ఇ-పోస్ విధానాన్ని అమలుచేసి సుమారు 11 లక్షల 55 వేల రేషన్ కార్డుదారులకు చెందిన 36 లక్షల జనాభాకు సరుకులు సక్రమంగా ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పంపిణీ జరుగుతుందని, ఈ విధానంతో ప్రభుత్వానికి ఎంతో ఆదాయం చేకూరిందని అన్నారు. అదే విధంగా జిల్లాలో ప్రధాన వ్యవసాయ రంగానికి చెందిన రైతాంగానికి ఎరువులు సకాలంలో సక్రమంగా అందించటానికి అనుగుణంగా ఈ నెల 5వ తేదీ నుండే మొబైల్ ఫెర్టిలైజర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం అమలుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను ఎరువుల డీలర్ షాపుల యాజమాన్యాలను ఎరువుల తయారీ, పంపిణీదారులకు ఆయన సూచించారు. ఈ మొబైల్ ఫెర్టిలైజర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం విధానం అమలులో భాగంగా ఎరువుల తయారీ కంపెనీలకు హోల్‌సేల్ డీలర్లకు రిటైల్ డీలర్లకు ఆన్‌లైన్ విధానంలో లాగింగ్ ఐడి, పాస్‌వర్డ్ కేటాయింపులు చేయటం జరుగుతుందన్నారు. ఎరువుల తయారీ సంస్థ నుండి రవాణాకు సిద్ధం చేసినప్పటి నుండి క్వాంటిటీ, ఎరువుల వివరాలతో ట్రక్కుషీటు తదితర వివరాలు ఇన్‌వాయిస్ జారీచేయటం జరుగుతుందని, దీనివల్ల ఎరువుల కంపెనీల వద్ద నిల్వలు, డీలర్ల వద్ద నిల్వలు రవాణా జరుగుతున్న సరుకు వివరాలు తదితర అంశాలు అన్నీ ఇన్‌లైన్లో అప్‌డేట్ మాచారం అందుబాటులోకి రావటమే కాకుండా ఎరువులు, క్రిమిసంహారక మందులు పక్కదారి పట్టే అవకాశం వుండదని కలెక్టర్ అన్నారు. జిల్లాకు ఖరీఫ్ సీజన్‌లో లక్షా 16వేల 725 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు పంపిణీ చేయటం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు యు.నరసింహారావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 980 రిటైల్ ఎరువుల దుకాణాలు వున్నాయని, వాటన్నింటిని ఆన్‌లైన్ విధానంతో అనుసంధానించటం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, వివిధ ఎరువుల కంపెనీల యాజమాన్యాలు, హోల్‌సేల్, రిటైల్ షాపుల యాజమాన్యాలు పాల్గొన్నారు.